Video Advertisement

ఇది ఇలా ఉండగా..నవదీప్ సైని ఆట చూసి అభిమానులు అందరు పొగడల్తో ముంచేశారు. తొలుత సింగిల్స్ తో మొదలెట్టి తర్వాత బౌండరీలు కొట్టాడు. విరాట్ కోహ్లీ కూడా నవదీప్ సైని కొట్టిన సిక్స్ చూసి వావ్ అంటూ చెప్పట్లు కొట్టాడు. సైని వికెట్ కి న్యూజిలాండ్ ఆటగాళ్లు సెలెబ్రేట్ చేసుకున్న తీరు చూస్తే అతను వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక అతను ఆటకి ముందే నెట్స్ లో బాటింగ్ కూడా చేసిన వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది. బహుశా తాను ఆడబోయే ఇన్నింగ్స్ కి ముందే హింట్ ఇచ్చాడు అనుకుంట. ఆ వీడియో మీరే చూడండి!

watch video:

ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా విఫలమైంది. టీమిండియా పరాజయం పాలై సిరీస్‌ను అతిథ్య జట్టుకు సమర్పించేసుకుంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలయ్యింది. దీంతో కివీస్ సిరీస్ సొంతం చేసుకుంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో జడేజా, నవదీప్ సైనీ గెలుపుపై ఆశలు రేపినా చివరి వరకూ ఆ జోరును కొనసాగించలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ గెలుపుపై ఆశలు రేపినా.. చివరి వరకూ ఆ జోరును కొనసాగించలేకపోయారు. దీంతో జడేజా, సైనీ పోరాటం వృధా అయింది. ఈ మ్యాచ్ లో నవదీప్ సైని 49 బంతుల్లో 5 ఫోరులు, 2 సిక్సులు తో 45 పరుగులు చేసాడు. అతను ఇప్పటివరకు బౌలర్ గా మాత్రమే తెలుసు. కానీ బాట్స్మెన్ విఫలమైన వేళ అతను తన బాటింగ్ తో కొద్దిసేపు కివీస్ ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు. భారత అభిమానుల్లో కొద్దిసేపు విజయ ఆశని నింపాడు. కానీ అతని పోరాటం వృధా అయ్యింది.