LOVE MOULI REVIEW : “నవదీప్” హీరోగా నటించిన ఈ సినిమా అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

LOVE MOULI REVIEW : “నవదీప్” హీరోగా నటించిన ఈ సినిమా అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

చాలా రోజుల తర్వాత నవదీప్ హీరోగా నటించిన లవ్ మౌళి సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో నవదీప్ ఒక డిఫరెంట్ పాత్రలో నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : లవ్ మౌళి
  • నటీనటులు : నవదీప్, పంఖురి గిద్వానీ.
  • నిర్మాత : సీ స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్
  • దర్శకత్వం : అవనీంద్ర
  • సంగీతం : గోవింద్ వసంత
  • విడుదల తేదీ : జూన్ 7, 2024

love mouli movie review

స్టోరీ :

మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చనిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. తాతయ్య కూడా మౌళికి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోతాడు. అప్పటి నుండి మౌళి ఎటువంటి నియమాలు లేకుండా పెరుగుతాడు. తనకు నచ్చినట్టు ఉంటాడు. మౌళి ఒక మంచి ఆర్టిస్ట్. అలా తను తయారు చేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (పంఖురి గిద్వానీ) ని సృష్టిస్తాడు. చిత్రతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చిత్ర, మౌళికి నచ్చినట్టు ఉంటుందా? ప్రేమకి అర్థం ఏంటో మౌళి తెలుసుకున్నాడా? చిత్రని తనకి నచ్చినట్టు మార్చుకున్నాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమా కథ తెలిసిన కథ. కానీ దీనికి సోషియో ఫాంటసీ అనే ఒక విషయాన్ని యాడ్ చేశారు. దాంతో కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రేమ అంటే ఏంటి అనే విషయాన్ని కొత్త కోణంలో చెప్పడానికి ప్రయత్నించారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నవదీప్ ఈ సినిమాలో ఒక కొత్త పాత్రలో నటించారు. తన పాత్రకి న్యాయం చేశారు. ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన పంఖురి గిద్వానీ కూడా బాగా నటించారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు పెట్టడం అవసరమా అని అనిపిస్తుంది. అవి లేకపోయినా సినిమాలో చెప్పాలి అనుకున్న విషయాన్ని అదే విధంగా చెప్పే అవకాశం ఉంది.

యూత్ కి కనెక్ట్ అవ్వడం కోసం పెట్టిన కొన్ని సీన్స్ డిలీట్ చేసినా కూడా సినిమా అంతే బాగుండేది. గోవింద్ వసంత అందించిన పాటలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. కృష్ణ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. టెక్నికల్ గా అన్ని రకాలుగా సినిమా బాగుంది. సినిమా ఎక్కువగా మేఘాలయలో నడుస్తుంది. లొకేషన్స్ చాలా బాగున్నాయి. అంతే బాగా చూపించారు. ఎడిటింగ్ కూడా డైరెక్టర్ అవనీంద్ర చేశారు. ఇద్దరు భిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇంకా బాగా చూపించే అవకాశం ఉంది. ఈ విషయం మీద జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • లొకేషన్స్
  • నవదీప్ నటన
  • కొన్ని కామెడీ సీన్స్
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • అనవసరమైన కొన్ని సీన్స్
  • సాగదీసినట్టుగా ఉండే ఫస్ట్ హాఫ్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

కథనం గురించి పట్టించుకోకుండా, లాజిక్స్ వెతకకుండా, అసలు ఈ సినిమాలో సోషియో ఫాంటసీ అనే విషయాన్ని ఎలా చూపించారు అని తెలుసుకోవాలి అనుకుంటే, లవ్ మౌళి సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.


End of Article

You may also like