సినిమాల్లో చూపించినట్లు ఈ మధ్య బయట కూడా జరుగుతున్నాయి. ఒకరు చంపారు ఒకరు చనిపోయారు కానీ ఇది ఒక ట్రయాంగిల్ స్టోరీ. ఈ వార్తను చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం… న్యూస్ 18 కథనం ప్రకారం గత నెల 17న నల్గొండ ఎంజి యూనివర్సిటీ విద్యార్థి నవీన్ ని హత్య చేసారు. హరిహరకృష్ణ, నవీన్‌, నిహారికా మధ్య ప్రేమ నడుస్తోంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్. నవీన్‌ అడ్డుతొలగించుకోవాలని హరిహర కృష్ణ అనుకున్నాడు.

Video Advertisement

అందుకు ప్లాన్ వేసాడు. గెట్ టుగెదర్ పార్టీ అని చెప్పి నవీన్‌ను హరిహర కృష్ణ పిలిచాడు. దాంతో నవీన్ వచ్చాడు. అనుకున్నట్టే హరిహర కృష్ణ హత్య చేసాడు.

గుండె, చెయ్యి, వేళ్లు, అరచేయి, మొండెం ఇలా అతను వేరుచేసి అక్కడ నుంచి బ్రాహ్మణపల్లి లో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. హత్య చేసిన విషయం చెప్పేసి శరీర భాగాలను మాయం చేసేందుకు హెల్ప్ అడిగాడు. ఇద్దరు కలిసి ప్లాస్టిక్ సంచిలో వాటిని పెట్టేసి మన్నెగూడ శివార్లలో వదిలి వచ్చేసారు. నవీన్‌ను హత్య చేసాక హరి ప్రియురాలికి ఫోన్‌ చేసి చెప్పాడు. ఆమె ఫోన్‌కు నవీన్ శరీర భాగాలను వాట్సాప్‌ కూడా చేశాడు. ఆమె కి భయం పట్టుకుంది. హరికి ఫోన్ చేస్తూనే వుంది. డెడ్ బాడీని ఎలా మాయం చెయ్యాలనేది ఆమె మాట్లాడింది. నవీన్ డెడ్ బాడీ దగ్గరకి కూడా తీసుకు వెళ్ళాడు. ఆ తరవాత నాగోల్‌లోనే ఒక రెస్టారెంట్‌కి వెళ్లి లంచ్ చేసారు.

representative image

24న నిహారిక మరియు స్నేహితుడు హాసన్‌ తో హరిహరకృష్ణ డెడ్ బాడీ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. మెసేజులు, కాల్‌ డేటా ఇవన్నీ డిలేట్ చేసేసారు. కానీ అదే రోజు రాత్రి హరిహర కృష్ణ లొంగిపోయాడు. అతను ఎందుకు లొంగిపోయాడంటే.. గత నెల 21 నుంచి ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసేసాడు హరి. హసన్‌, నిహారికాతోనే టచ్‌ లో ఉన్నాడు. హరి కనపడకపోవడం తో తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసుల నుంచి ఒత్తిడి వలన ఈ నెల 24న రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

ప్రేమించే యువతి కోసమే ఇలా చేసానని ఒప్పుకున్నాడు. ఈ కేసులో నిహారిక తనకి సంబంధం ఏమి లేదని అంటోంది. . క్రాస్ క్వశ్చన్స్‌తో చేయడంతో ఫైనల్ గా దొరికిపోయింది. ఆమెను ఏ3గా చేర్చారు. హాసన్ ని ఏ2గా చేర్చారు. నిహారికాను నిన్న హయత్‌ నగర్‌ కోర్టులో ప్రొడ్యూస్‌ చేశారు. చంచల్‌గూడ విమెన్ జైలుకు ఆమెని తరలించారు. 14రోజుల రిమాండ్ కోసం హసన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.