RCB మ్యాచులలో స్పెషల్ అట్రాక్షన్…ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.?

RCB మ్యాచులలో స్పెషల్ అట్రాక్షన్…ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.?

by Mohana Priya

Ads

నిన్నటి మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ క్రికెటర్, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ కైల్ జెమీసన్ ఒక యువతిని చూసి నవ్వడం కెమెరా చేతికి చిక్కింది. తర్వాత ఆ పిక్చర్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. అలాగే గత సంవత్సరం ముంబై ఇండియన్స్ జట్టుకి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జెర్సీ వేసుకుని ఆ  జట్టుని ఛీర్ చేస్తున్న ఒక మహిళను మీరు టీవీలో చూసే ఉంటారు.

Video Advertisement

చాలామందికి తను ఎవరు అనే అనుమానం వచ్చి ఉండొచ్చు. తన పేరు నవనీత గౌతమ్. నవనీత గౌతమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మసాజ్ థెరపిస్ట్ గా చేస్తున్నారు. నవనీత గౌతమ్ గురించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రకటించినప్పుడు కొద్దిరోజుల వరకు హెడ్ లైన్స్ లో ఉన్నారు. దానికి కారణం ఐపిఎల్ ఫ్రాంచైజీలో ఫిమేల్ స్టాఫ్ తక్కువగా ఉండడమే.

నవనీత గౌతమ్ కెనడాకి చెందిన వారు. నవనీత ఒక అథ్లెటిక్ థెరపిస్ట్. అంటే స్పోర్ట్స్ ఆడే వారిని (అథ్లెట్స్) ఎలా ట్రీట్ చేయాలి అనే దానిపై ఇది ఒక స్పెషలైజేషన్. నవనీత తల్లిదండ్రులకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. నవనీత ఇంత దూరం ఇండియాకి ప్రయాణించడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదు.

కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలిసి పని చేస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందట. నవనీత గౌతమ్ అంతకుముందు FIBA ఏషియా కప్ కి, అలాగే గ్లోబల్ టి20 కెనడా లీగ్ లో టొరంటో నేషనల్స్ తో కూడా పనిచేశారు.

 

 


End of Article

You may also like