లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన నయనతార గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈమె అందరికీ సుపరిచితమే. తెలుగు లో కూడా ఈమె చాలా సినిమాలు చేసారు. మంచి గుర్తింపు ని పొందారు. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రావడం… వచ్చిన అవకాశాలని దక్కించుకోవడం అంత ఈజీ కాదు. టాప్ లో ఉండడం ఎంతో కష్టమైనది.

Video Advertisement

సినిమాలో అవకాశాలు కోసం చాలా మంది ఎంతో కష్ట పడుతుంటారు. కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లేని నటులకైతే ఇండస్ట్రీ లో నిలబడడం ఇంకా కష్టం.

3 nayanatara

నయనతార చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతారగా ఫేమస్ అయ్యిపోయారు. తెలుగు లో నయన్ తులసి, సింహా, సైరా, లక్ష్మీ వంటి సినిమాల తో హిట్లని పొందారు. కేవలం ఒక్క తెలుగు సినిమాలే కాక తమిళ్, మలయాళ భాషల్లో కూడా నటించారు. ఇప్పటికి నయన్ 75 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఇక ఈ ఏడాది సినిమాల విషయానికి వస్తే.. డిసెంబరు లో వచ్చిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్‌గా మిగిలాయి. నయనతారకి కాలం కలిసి రాలేదు. ఈ మధ్య ఆమె నటించిన సినిమాలు హిట్టు కాలేదు.

ఆమె నటించిన గాడ్‌ ఫాదర్ మూవీ కూడా అంతలా ఆకట్టుకోలేదు. దీనితో ఆమె మంచి స్టోరీస్ ని ఎంచుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మంచి కథ వున్నవి ఎంచుకుంటే హిట్ అవ్వచ్చేమో.. అలానే ‘గోల్డ్’ సినిమా లో కూడా ఈమె నటించారు. ఈ మలయాళి సినిమా తమిళ్‌లోనూ విడుదల అయ్యింది. కానీ హిట్ అవ్వలేదు. అలానే కనెక్ట్ మూవీ వచ్చింది. కానీ అది కూడా హిట్ అవ్వలేదు. ఇదిలా ఉంటే ఈమె తన నెక్స్ట్ సినిమాని షారూక్ ఖాన్‌తో చేస్తోంది. ఈ చిత్రం పేరు జవాన్. ఈ సినిమా పాన్ ఇండియా గా తీసుకు రానున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

https://telugu.samayam.com/telugu-movies/cinema-news/back-to-back-flops-for-star-heroine-nayanthara/articleshow/96524946.cms