Home Filmy Adda ఆస్తి వివాదంలో విగ్నేష్, నయనతార..!

ఆస్తి వివాదంలో విగ్నేష్, నయనతార..!

by Mohana Priya

నయనతార మరియు విగ్నేష్ దంపతులు ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. విగ్నేష్ కుటుంబం యొక్క ఉమ్మడి ఆ విషయంలో ఈ జంటపై కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. విగ్నేష్ శివన్ తండ్రి శివ కొళుదు వాళ్లు 9మంది అన్నదమ్ములు. వీరు తిరుచ్చి జిల్లాలోని లాల్ గుడి గ్రామం వాస్తవ్యులు. పోలీస్ ఇన్ఫర్మేివ్ గా పనిచేస్తున్న విఘ్నేశ్ తండ్రి కొంత కాలం క్రితం చనిపోయారు.

ఆయన బతికి ఉన్న రోజుల్లో అన్నదమ్ములకు తెలియకుండా ఉమ్మడి ఆస్తిని ఇతరులకు అమ్మాడని ఆయన సోదరులు మాణిక్యం మరియు కుంజిత పాదం ఆరోపించడం జరిగింది. ఇదే విషయంపై విగ్నేష్ దంపతులతో పాటు అతని మొత్తం కుటుంబ సభ్యులపై తిరుచ్చి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

అంతేకాకుండా మోసపూరితంగా ఆస్తిని కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి తమ ఆస్తిని తిరిగి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వారు విగ్నేష్ ,అతని తల్లి మీనా కుమారి, సోదరీ ఐశ్వర్య మరియు భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాల్సిందిగా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు డిఎస్పి పోలీసులకు కేసు దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశాలు కూడా జారీ చేశారు.

అయితే ప్రస్తుతం ఈ విషయం తమిళ్ ఇండస్ట్రీలో పెద్ద టాప్ గా మారింది. ఏడేళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వీరు పెళ్లయింది మొదలుకొని ఏదో ఒక వివాదంలో చెప్పుకోవడం అభిమానులకు బాధగా ఉంది. పెళ్లి అయిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి మాడవీధులలో చెప్పులతో సంచరించడంపై అప్పట్లో ఈ జంటపై తీవ్ర స్థాయి విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణ చెప్పి బయటపడ్డారు.

nayanatara surrogacy is legal says goverment comittee

ఆ తర్వాత పెళ్లి అయ్యి నాలుగు నెలలు కూడా పూర్తికాకముందే కవలలకు తల్లిదండ్రులని ప్రకటించడంతో సరోగసి నిబంధనలు ఉల్లంఘించారని తమిళనాడు ప్రభుత్వం వీరిపై విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితమే పెళ్లయింది అని.. సరోగసి చట్టంలోని అన్ని నిబంధనలు పాటించామని ఆధారాలు చూపించి వివాదంలో నుంచి బయటపడ్డారు. మరి ఇప్పుడు తాజాగా ఈ ఉమ్మడి ఆస్తి వివాదం మరొకసారి ఈ జంటకు పెద్ద తలనొప్పిగా మారింది.

You may also like