Home Filmy Adda “బాహుబలి” లో నయనతార కూడా ఉందా..? ఇంతకీ ఏం రోల్ చేసింది.?

“బాహుబలి” లో నయనతార కూడా ఉందా..? ఇంతకీ ఏం రోల్ చేసింది.?

by Mohana Priya

ప్రస్తుతం వెబ్ సిరీస్, డిజిటల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. లాక్ డౌన్ పుణ్యమా అని చాలా మంది ప్రేక్షకులు వెబ్ సిరీస్ చూడడం మొదలుపెట్టారు. అంతే కాకుండా ఎంతో మంది దర్శక, నిర్మాతలు తమ సినిమాలను కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే కేవలం డిజిటల్ రిలీజ్ కోసం మాత్రమే కూడా సినిమాలను రూపొందిస్తున్నారు.

Nayanthara to star in Baahubali prequel

అలా వెబ్ సిరీస్, డిజిటల్ సినిమాల్లో నటించే వారు కూడా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. అంతే కాకుండా స్టార్ నటులు కూడా ఈ వెబ్ సిరీస్, డిజిటల్ రిలీజ్ ల వైపు ఆసక్తి చూపుతున్నారు. అలా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి ఎంతో మంది నటులు అడుగుపెడుతున్నారు. ఇటీవల సమంత అక్కినేని కూడా ద ఫ్యామిలీ మ్యాన్ తో వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టారు.

Nayanthara to star in Baahubali prequel

 

సమంత మాత్రమే కాకుండా అమలా పాల్, శృతి హాసన్ ఇంకా ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరొక స్టార్ హీరోయిన్ కూడా చేరబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తెలుగు సినిమా చరిత్రలో ఇంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

Nayanthara to star in Baahubali prequel

 

అయితే బాహుబలికి ప్రీక్వెల్ రాబోతోంది. అందులో శివగామి పాత్రలో భలే మంచి రోజు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వామిక గబ్బి నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్ లో ఒక ముఖ్య పాత్ర పోషించడానికి సిరీస్ బృందం నయనతారని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా నయనతార కూడా ఈ సిరీస్ లో నటించడానికి సరే అన్నారట.

Nayanthara to star in Baahubali prequel

ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో టెలికాస్ట్ అవుతుంది. నయనతార ఈ సిరీస్ లో నటిస్తారా? లేదా? తెలియాలి అంటే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం నయనతార కొన్ని తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటిస్తున్న సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

You may also like