నయనతార తమిళ్ ఇండస్ట్రీతో పాటు, తెలుగు ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకున్నారు. మధ్య మధ్యలో కొన్ని మలయాళం సినిమాలతో పాటు కొన్ని కన్నడ సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు నయనతార బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నారు. అది కూడా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమా తో. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతోంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు అని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి వార్తలు మాత్రమే కాదు ఇదే నిజమని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు నయనతార తన బాలీవుడ్ డెబ్యూట్ సినిమా షూటింగ్ పూణేలో మొదలుపెట్టబోతున్నారట. షూటింగ్ లో నయనతార షారుక్ ఖాన్ పాల్గొనబోతున్నారు. ఈ నెలలోనే షూటింగ్ మొదలవ్వబోతోంది. ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లూసిఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ లో కూడా ఒక పాత్ర పోషిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా కొన్ని తమిళ సినిమాలు, అలాగే మలయాళం సినిమాల్లో కూడా నటిస్తున్నారు.