Ads
స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గత కొన్ని సంవత్సరాల నుండి రిలేషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, వీరిద్దరూ 2022లో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయట. ఇటీవల వీరిద్దరు కలిసి తిరుపతితో పాటు, మరికొన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించారు. అయితే, నయనతార వివాహం కూడా ఐశ్వర్య రాయ్ వివాహం జరిగిన విధానంలోనే జరగబోతోంది అని సమాచారం. అంటే, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచన్ ని పెళ్లి చేసుకొనే ముందు దోష నివారణ కోసం ఒక చెట్టుని పెళ్లాడారు.
Video Advertisement
నయనతార కూడా దోష నివారణకు మొదట ఒక చెట్టుని పెళ్ళాడి తర్వాత విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి పెళ్ళి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించారట. వీరి పెళ్లి కూడా చాలా సింపుల్ గా జరగబోతోంది. ఇరు కుటుంబ సభ్యులు, అలాగే ఇండస్ట్రీలోని క్లోజ్ ఫ్రెండ్స్ వీరి పెళ్లికి హాజరవ్వబోతున్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా కొన్ని నెలల క్రితం జరిగింది. ఈ విషయాన్ని నయనతార ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వారు తమ రిలేషన్ కి సంబంధించిన విషయాలన్నిటిని వ్యక్తిగతంగానే ఉంచుకుంటారు అని, సోషల్ మీడియాలో ప్రకటించరు అని, ఎందుకంటే ఎంగేజ్మెంట్ అనేది చాలా వ్యక్తిగతమైన విషయం అని నయనతార చెప్పారు.
End of Article