Home Filmy Adda ”NBK 107” కోసం మరోసారి..! ఈ సెంటిమెంట్ మళ్ళీ కలిసి వస్తుందా..?

”NBK 107” కోసం మరోసారి..! ఈ సెంటిమెంట్ మళ్ళీ కలిసి వస్తుందా..?

by Megha Varna

నందమూరి నటసింహం బాలకృష్ణ, కమర్షియల్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ కాంబినేషన్ లో, ఎన్బీకే 107 వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఈవెంట్ కు చారిత్రక కట్టడమైన కర్నూలు కొండారెడ్డి బురుజును ఎంపిక చేసి దీపావళి కానుకగా టైటిల్ విడుదల చేసారు. ఈ చిత్రాని కి ‘ వీర సింహ రెడ్డి’ అనే టైటిల్ పెట్టారు.

ఇద్దరి నుంచి రెండు సూపర్ హిట్స్ వచ్చిన తర్వాత వీరి కాంబో పై అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటికే విడుదైన పోస్టర్లు, టీజర్, ఈ సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి.

NBK 107 movie title release in kurnool..!!

టీజర్ లో పక్కా మాస్ లుక్ తో కనిపించిన బాలయ్య, పవర్ ఫుల్ డైలాగ్స్ తో రెచ్చి పోవడం తో, బొమ్మ బ్లాక్ బస్టర్ అని నందమూరి అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే నవంబర్ 9 నుంచి సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది అనంతపూర్ లో స్టార్ట్ చేస్తున్నారట. పెన్నోబిలం లక్ష్మి నర సింహ స్వామి గుడి దగ్గర తొమ్మిదన షూటింగ్ ఉండనుంది.

10,11 న అమిద్యాల, రాకెట్ల, ఉరవకొండ ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. అలానే 12 ,13 న పెనుగొండ కోట దగ్గర షూటింగ్ చేయనున్నారట. ఇలా అనంతపురం జిల్లా లో బాలయ్య షూటింగ్ జరగనుంది. అఖండ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందట. అది హిట్ అయినట్టే ఇది కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

You may also like