Home Filmy Adda NBK 107 స్టోరీ ఇదేనా..? బాలయ్య మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టేలాగా ఉన్నారుగా.?

NBK 107 స్టోరీ ఇదేనా..? బాలయ్య మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టేలాగా ఉన్నారుగా.?

by Megha Varna

ఇటీవలే అఖండ చిత్రంతో భారీ సక్సెస్ సాధించారు బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన ప్రాజెక్టుగా ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం NBK 107. ఇది బాలకృష్ణ 107 వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.

ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో శాండిల్ వుడ్ హీరో దునియా ఫేమ్ విజయ్ విలన్ గా నటిస్తున్నారు.

NBK 107 movie title release in kurnool..!!

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయ్యిపోయింది. అలానే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని కూడా విడుదల చేశారు. పోస్టర్ ని చూసి బోయపాటి కాంబినేషన్ లో బాలకృష్ణ చేసిన సినిమా పోస్టర్లు మాదిరిగా ఉన్నాయని కూడా చెప్పారు.  ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయం బయటకి వచ్చింది. ఈ సినిమా మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టేలాగ కనపడుతోంది.

కథ కి సంబంధించి ఓ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ ఉంటుందిట. ఎమోషన్స్ కూడా ఎక్కువ వుంటాయని టాక్. అలానే సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉండనుంది. వరలక్ష్మి శరత్ కుమార్ సోదరి పాత్ర చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఏమిటో అందరికీ తెలుసు. ఆమె నటన గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఆమె రోల్ కి ఆమె పక్కా న్యాయం చేస్తారు. అఖండ సినిమా లో కూడా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అలానే అఖండ సినిమా లో యాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సినిమా కూడా అఖండలానే యాక్షన్, ఎమోషన్స్ తో ఉండనుంది. అందుకే బాలయ్య నటిస్తున్న ఈ సినిమా కూడ హిట్ అవుతుందని టాక్.

 

You may also like