Ads
ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన శకుంతలా దేవి సినిమా మీలో చాలా మంది చూసే ఉంటారు. ఈ సినిమా రాకముందే హ్యూమన్ క్యాలిక్యులేటర్ శకుంతలా దేవి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ సినిమా వచ్చిన తర్వాత ఆవిడ గురించి ఇంకా ఎక్కువ మందికి తెలిసింది. ఇప్పుడు మరొక హ్యూమన్ క్యాలిక్యులేటర్ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.
Video Advertisement
ఇటీవల లండన్ లో మైండ్ స్పోర్ట్స్ ఒలంపియాడ్ లో మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ జరిగింది. అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 13 దేశాలకు చెందిన 10 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వ్యక్తులు పాల్గొంటారు.
ఈ పోటీలో హైదరాబాద్ కి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ నీలకంఠ భాను ప్రకాష్ బంగారు పతకం సాధించారు. దాంతో భాను ప్రకాష్ ని ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ గా ప్రకటించారు.
21 సంవత్సరాల వయసున్న నీలకంఠ భాను ప్రకాష్ 50 జాతీయ స్థాయి రికార్డులను, నాలుగు అంతర్జాతీయ స్థాయి రికార్డులని సాధించారు. 2016 లో ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ టైటిల్ కోసం జరిగిన పోటీలో అత్యంత వేగంగా కాలిక్యులేట్ చేసే గణిత శాస్త్ర నిపుణులు స్కాట్ ఫ్లాన్స్బర్గ్ ని ఓడించారు భాను ప్రకాష్.
ఆగస్టు 15, 2020 న 29 పార్టిసిపెంట్స్ ని ఓడించి, 65 పాయింట్లతో బంగారు పతకం సాధించారు. భవిష్యత్తులో మాథ్స్ ల్యాబ్స్ నిర్మించాలని భాను ప్రకాష్ అనుకుంటున్నారట. ఈ విషయంపై నీలకంఠ భాను ప్రకాష్ మాట్లాడుతూ ” నేను భవిష్యత్తులో మాథ్స్ ల్యాబ్స్ నిర్మించి, అవి పిల్లలకి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తాను. మాథ్స్ అంటే భయం పోగొట్టడానికి ప్రయత్నిస్తాను.
మనదేశంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే సగటు నలుగురు పిల్లల్లో ముగ్గురు పిల్లలు మాథ్స్ అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. మాథ్స్ అంటే ఒక ఫోబియా ఏర్పడింది. ఎంతోమంది పిల్లలు డిమోటివేషన్ కి గురవుతున్నారు. అందుకే భారతదేశంలో గ్రామాల్లో ఉండే స్కూళ్లలో పిల్లలు తక్కువగా ఉంటారు” అని అన్నారు.
End of Article