Home Filmy Adda ఇవెక్కడి టాస్క్ లు..? అసలు జడ్జెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.? ఇందులో కామెడీ ఏంటో.?

ఇవెక్కడి టాస్క్ లు..? అసలు జడ్జెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.? ఇందులో కామెడీ ఏంటో.?

by Mohana Priya

సాధారణంగా సండే అంటే టీవీలో ఎక్కువ శాతం సినిమాలు వస్తాయి. కానీ ఈ మధ్య సండే కూడా ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు. సండే రోజు దాదాపు అందరికీ హాలిడే ఉంటుంది. దాంతో అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి కుటుంబం మొత్తం కలిసి టీవీ చూస్తారు. కొన్ని ప్రోగ్రామ్స్ బాగానే ఉన్నాయి కానీ కొన్ని ప్రోగ్రామ్స్ లో మాత్రం అభ్యంతరకరమైన కాన్సెప్ట్స్ ఉంటున్నాయి.

negative comments on comedy stars promo

వాళ్ళు చేసే షో కామెడీ షోనా ? రియాలిటీ షోనా ? అసలు షో కాన్సెప్ట్ ఏంటి ? అనే విషయం ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు ఏమో అనిపిస్తుంది. అందుకు మళ్ళీ ఆ షోలో ఉంటే జడ్జెస్ ఇచ్చే రియాక్షన్స్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. వివరాల్లోకి వెళితే కొంతకాలం క్రితం మా టీవీలో మొదలైన ప్రోగ్రాం కామెడీ స్టార్స్.

negative comments on comedy stars promo

ఈ ప్రోగ్రాం కి వర్షిణి యాంకర్ గా వస్తారు. శేఖర్ మాస్టర్, అలాగే ఈశ్వర్ సినిమా హీరోయిన్ శ్రీదేవి జడ్జ్ లుగా వస్తారు. ఈ ప్రోగ్రాంలో వచ్చే కమెడియన్స్ కూడా మనందరికీ చాలా వరకు తెలిసిన వాళ్లే ఉన్నారు. ఇందులో కూడా డిఫరెంట్ స్కిట్స్ తో పార్టిసిపెంట్స్ మన ముందుకు వస్తారు.

negative comments on comedy stars promo

అయితే, ఇందులో ఇటీవల టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో ఒక రౌండ్ పెట్టారు. అందులో స్టేజ్ మీద ఒక షీట్ వేసి, దాని మీద నూనె పోసి, దాని మీద ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చి డాన్స్ వేయాలి. ఇందులో చాలా వరకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెయిర్ గా వచ్చారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇద్దరు అబ్బాయిలు రావడం జరిగింది.

negative comments on comedy stars promo

అయితే ఆ రౌండ్ చూడడానికి చాలా మామూలుగానే ఉంది. కామెడీగా ఎక్కడా అనిపించలేదు. కానీ జడ్జెస్ మాత్రం చాలా నవ్వారు. అలాగే కొన్నిసార్లు వాళ్ల డాన్స్ చూస్తే ప్రేక్షకులకు ఇబ్బందికరంగా కూడా అనిపించింది. ఈ ఎపిసోడ్ లోని ఈ రౌండ్ కి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో విడుదలైంది. దాని కింద “ఈ రౌండ్ ఏంటి ?” అని కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

watch video : 

Also watch:

https://youtu.be/xszY6gzNijw

 

You may also like