అల వైకుంఠపురంలో చిత్రం ఇండస్ట్రీ హిట్ కాగా ఇందులో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించగా ,సంగీతాన్ని తమన్ సమకూర్చారు దీంతో ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది ..నెట్ ఫ్లిక్స్ టీం అల్లు అర్జున్ పై తాజాగా కొన్ని ట్రోల్స్ చేసింది …వివరాలలోకి వెళ్తే …

Video Advertisement

నిన్న అల్లు అర్జున్ ఫోటోను పోస్ట్ చేసారు ,అందులో అల్లు అర్జున్ చిత్రం ఒక ఆలూలో అతికించబడింది ..నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని పోస్ట్ చేసి బంగాళా దుంపలు చాలా వెరైటీ కూరగాయలు అని తెలుసు కదా అని పోస్ట్ చేసింది ..అల్లు అర్జున్ అభిమానులు ఈ ట్రోల్స్ పై మండిపడ్డారు ..నెగిటివ్ గా కాకపోయినా తమ అభిమాన హీరో పేరు మీద ఇలాంటి వ్యాఖ్యలు రాసి పోస్ట్ చెయ్యడం అభిమానాలు తట్టుకోలేకపోయారు ..తమ అభిమాన హీరోల మీద ఎటువంటి ట్రోల్ల్స్ తట్టుకోలేరని నెట్ ఫ్లిక్స్ కూడా తెలుసుకుంది …వెంటనే ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది నెట్ ఫ్లిక్స్.

ఇది ఇలా ఉండగా ఈ అందమైన బుట్టబొమ్మ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా నెట్ ఫ్లిక్స్ తెలిపింది .కాగా బుట్ట బొమ్మ అని అందమైన అమ్మాయిలని అంటారు కానీ అబ్బాయిలను కాదు అని కామెంట్స్ చేసారు నెటిజన్లు .దీంతో నెట్ ఫ్లిక్స్ ఫాలోవార్స్ అందరు కూడా ట్రోల్ చేసారు . బన్నీ అభిమానులతో అంత ఈజీ కాదు అని అనుకుంది నెట్ ఫ్లిక్స్ ..