RRR “హిందీ” వెర్షన్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్..! “ఏరా జక్కన్నా.?” అంటూ..?

RRR “హిందీ” వెర్షన్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్..! “ఏరా జక్కన్నా.?” అంటూ..?

by Mohana Priya

Ads

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

highlights in rrr movie

ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడింది. తర్వాత సినిమా మార్చ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో వర్షన్స్ జీ 5 లో విడుదల అయ్యాయి. హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది.

netizen tweet about rrr hindi version goes viral

ఈ సినిమా హిందీ వెర్షన్ మీద ఒక నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ నెటిజన్ ఈ విధంగా రాశారు. “ఏరా జక్కన్నా! హిందీ వెర్షన్ లో కూడా కొన్ని సీన్స్ లో అన్నా అని పెట్టడం అంత అవసరమా. నా ఫ్లోర్ లో నేపాల్ పాపకి ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ లో అన్నా అనే వర్డ్ (పదం) తెగ నచ్చేసింది అంట. “ఆ వర్డ్ చాలా బాగుంది నేను కూడా నిన్ను అన్నా అని పిలుస్తా” అంటుంది” అని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like