Home Filmy Adda “కనీసం ఒక ఒరిజినల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేరా.?” అంటూ “రాధే శ్యామ్” పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.!

“కనీసం ఒక ఒరిజినల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేరా.?” అంటూ “రాధే శ్యామ్” పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.!

by Mohana Priya

ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్డే, ప్రేరణ అనే ఒక అమ్మాయి పాత్రను పోషిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే టీచర్ గా నటిస్తారని సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, అలాగే కృష్ణం రాజు గారు కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Netizens comments on Radhe Shyam pooja hegde birthday special poster

ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఏదైనా ఒక ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు సినిమా బృందం స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ ఉంది. ఇటీవల పూజా హెగ్డే తన 31వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినిమా బృందం మరొక పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పూజా హెగ్డే వైట్ కలర్ గౌన్ ధరించి ఉన్నారు. అయితే ఈ పోస్టర్ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Netizens comments on Radhe Shyam pooja hegde birthday special poster

అందుకు కారణం ఏంటంటే పూజా హెగ్డే, గ్యాలరీ గ్రాండ్ లో నిలబడి ఉన్నారు. అది ఇటలీలో ఉన్న ఒక ప్రముఖ కట్టడం. ఈ పిక్చర్స్ మనకి గూగుల్ లో చాలా దొరుకుతాయి. దాంతో “అదే బ్యాక్ గ్రౌండ్ తీసుకొచ్చి పూజా హెగ్డేని పెట్టి, ఎడిట్ చేసి, పోస్టర్ విడుదల చేశారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాధే శ్యామ్ పోస్టర్స్ మీద ఇలా నెగిటివ్ కామెంట్స్ రావడం ఇది మొదటిసారి ఏమి కాదు. అంతకుముందు కూడా అన్నిటికంటే మొదట విడుదల అయిన పోస్టర్, ఎన్నో సినిమా పోస్టర్లని పోలి ఉంది అని కామెంట్ చేశారు. ఇప్పుడు దీనిపై కూడా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి.

You may also like