Ads
మాస్ మహారాజా రవి తేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి అంత మంచి స్పందన రావట్లేదు. సినిమా కథ బాగున్నా కూడా టేకింగ్ సరిగ్గా లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రవి తేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేదు.
Video Advertisement
రవి తేజ గత సంవత్సరం విడుదలైన క్రాక్ సినిమాతో హిట్ కొట్టారు. దాంతో తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే విధంగా ఉంటాయేమో అని ప్రేక్షకులు ఆశించారు. ఇప్పుడు రవి తేజ ఈ సినిమాలో ఒక మంచి పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు అని తెలిసిన తర్వాత మళ్లీ రవి తేజ హిట్ కొడతారు అని అన్నారు. కానీ అలా జరగలేదు.
అయితే ఈ సినిమాలో చాలా పొరపాట్లు ఉన్నాయి, అందుకే సినిమా ఫలితం ఈ విధంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఒక స్టార్ హీరో సినిమాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి కూడా ఈ సినిమాలో తీసుకోలేదు అని అంటున్నారు. సినిమా నిజజీవిత సంఘటన ఆధారంగా రూపొందింది అని చెప్పారు. సినిమాలో చెప్పాలి అనుకున్న పాయింట్ కూడా బాగుంది. కానీ అలాంటి విషయాన్ని హ్యాండిల్ చేసే విధానం ఇది కాదు అని అంటున్నారు.
హీరో అసలు విషయం చెప్పినా కూడా ప్రేక్షకులలో ఒక ట్విస్ట్ చూసిన అనుభూతి రాదు. అంత ఫ్లాట్ గా ఉంది అని అంటున్నారు. ఈ సినిమా 1990 నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో రెండు పాటలు ఉంటాయి. పాటలు వినడానికి, చూడటానికి చాలా బాగున్నాయి. రెండు పాటలు కూడా ఫారిన్ లొకేషన్లలో షూట్ చేశారు. ఆ ఫారిన్ లొకేషన్లు చూస్తూ ఉంటే అవి ఇప్పుడు ఈ కాలానికి తగినట్లు ఉన్నాయి. అప్పట్లో జరిగిన సినిమా అని చూపిస్తున్నప్పుడు పాటలు కూడా అలాగే రావాలి కానీ సడన్ గా ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు పాటలు ఎలా మారాయి అని అంటున్నారు.
అసలు సినిమాలో స్పెషల్ సాంగ్ అవసరం కూడా లేదు. ఏదో కావాలి అని ఆ పాట పెట్టినట్టు ఉంది అని అంటున్నారు. అన్నిటికంటే పెద్ద విషయం డబ్బింగ్. అసలు డబ్బింగ్ విషయంలో ఈ సినిమాలో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేదు అని కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో పాత్రలు పోషించిన వాళ్ళు చెప్పే డైలాగ్ ఒకటి అయితే వచ్చే వాయిస్ లో ఉండే డైలాగ్ వేరే లాగా ఉంది. ఒక చోట రెండు చోట్ల కాదు. చాలా చోట్ల సినిమా మొత్తం ఇలాగే జరిగింది. దాంతో ఇవి కూడా చూసుకోకపోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది.
End of Article