Home Filmy Adda Radhe Shyam : రాధే శ్యామ్ “కొత్త పోస్టర్” వెనకాల ఇంత కథ ఉందా..?

Radhe Shyam : రాధే శ్యామ్ “కొత్త పోస్టర్” వెనకాల ఇంత కథ ఉందా..?

by Mohana Priya

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

netizens decode radhe shyam two heartbeats poster

రాధే శ్యామ్ రెండో పాటకి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. ఈ పోస్టర్ వెనుక ఉన్న కథని నెటిజన్లు కనిపెట్టారు. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే నిల్చోని ఉంటారు. వారి బ్యాక్‌గ్రౌండ్ అంతా చూస్తుంటే గుండె షేప్‌లో ఉంది అనే కామెంట్స్ వస్తున్నాయి. దాంతో దర్శకుడైన రాధా కృష్ణ కుమార్ ని అందరూ అభినందిస్తున్నారు. మరి నిజంగా ఈ పోస్టర్ గుండెని చూపించేలా డిజైన్ చేయడం నిజమేనా? లేదా అది అలా అనిపించిందా? సినిమా బృందానికి మాత్రమే తెలియాలి. ఏదేమైనా సినిమా మాత్రం జనవరి 2022 లో విడుదల అవుతుంది.

You may also like