Home Filmy Adda RRR లో ఆ విషయంలో డిసప్పాయింట్ అయిన “ఎన్టీఆర్” ఫ్యాన్స్..? కారణమేంటంటే..?

RRR లో ఆ విషయంలో డిసప్పాయింట్ అయిన “ఎన్టీఆర్” ఫ్యాన్స్..? కారణమేంటంటే..?

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి.

changed shot of ntr in rrr trailer

కానీ ఒక విషయంపై మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా చాలా బాగా నటించారు. ఎమోషనల్ సీన్స్ లో అయితే ప్రేక్షకులు కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యే అంత బాగా చేశారు. సినిమా మొదటి హాఫ్ మొత్తం కూడా కొమరం భీమ్ మీదే నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా చాలా సీన్స్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రకి సంబంధించిన సీన్స్ ఉంటాయి.

rrr trailer analysis and hidden details

ఈ పాత్రతో సమానంగా రామరాజు సీన్స్ కూడా ఉంటాయి. కానీ చివరికి వచ్చేటప్పటికి కొమరం భీమ్ పాత్రకి ఇంకొంచెం ప్రాధాన్యత ఇస్తే బాగుండేది అని అంటున్నారు. చివరి 30 నిమిషాలు సినిమాకి కీలకం. అలాంటి సమయంలో కొమురంభీం పాత్రలో కొంచెం అయినట్టు అనిపించింది అని కామెంట్స్ వస్తున్నాయి. అప్పుడు కూడా కొమరం భీమ్ పాత్ర కి ముందు ఉన్న అంతే ప్రాధాన్యత ఉండి ఉంటే బాగుండేది అని అంటున్నారు.

You may also like