Ads
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఇప్పటికే విడుదల అయ్యి చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి రెండవ భాగం కూడా వస్తోంది. ఈ సినిమా పోస్టర్ కూడా ఇటీవల విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ కనిపిస్తున్నారు. గంగమ్మ తల్లి జాతర సందర్భంగా అల్లు అర్జున్ ఉన్న ఒక ఫోటోని విడుదల చేశారు.
Video Advertisement
అయితే ఈ ఫోటో విడుదల చేసిన తర్వాత, అలాగే పుష్ప ఎక్కడ ఉన్నాడు అనే ఒక వీడియో కూడా విడుదల చేసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఇప్పటికే పుష్ప మానరిజం అంతర్జాతీయ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఇంకా ఫేమస్ అవుతుంది అని అంటున్నారు.
అలాగే ఇందులో బంగారానికి కూడా సంబంధించి స్టోరీ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక ప్రముఖ సెలబ్రిటీ అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పుష్ప పోస్టర్ లాగానే తన పోస్టర్ విడుదల చేశారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయ్యి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన అవినాష్ అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
దాంతో ఈ ఫోటో చూసిన వాళ్ళు అందరూ కూడా, “అల్లు అర్జున్ చేస్తే గంగమ్మ తల్లి లాగా ఉంది. నువ్వు చేస్తే మా పక్కింటి మంగమ్మ లాగా ఉంది” అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొంత మంది అయితే, “ఈ పోస్ట్ డిలీట్ చేయకపోతే నీకు మామూలుగా ఉండదు” అని వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. కానీ ఏదేమైనా ఈ పోస్ట్ మాత్రం ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది. ఇంకా పుష్ప సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో మొదటి పార్ట్ లో కనిపించిన వాళ్ళు మాత్రమే కాకుండా ఇప్పుడు ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు ఉంటారు అనే వార్తలు వస్తున్నాయి.
End of Article