Home Filmy Adda “ఇప్పుడు మీకు ఈ హక్కు ఎవరిచ్చారు..?” అంటూ… సమంత “పాత ట్వీట్‌”ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

“ఇప్పుడు మీకు ఈ హక్కు ఎవరిచ్చారు..?” అంటూ… సమంత “పాత ట్వీట్‌”ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

by Mohana Priya

పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక ఎర్ర చందనం ఎగుమతి చేసే వ్యక్తిగా కనిపిస్తారు.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. వీళ్లు మాత్రం కాదు సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, ఇంకా చాలా మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

netizens recalling samantha tweet on 1 nenokkadine poster

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో ఇటీవల విడుదల అయ్యింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అనే ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ పాటపై ట్రోలింగ్ మొదలయ్యింది. మగవాళ్లని తిడుతున్నట్టుగా ఈ పాట ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమంత చేసిన ఒక పాత ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

netizens recalling samantha tweet on 1 nenokkadine poster

1 నేనొక్కడినే సినిమా టైమ్‌లో సమంత, మహేష్ బాబు వెనకాల కృతి సనన్ ఉన్న ఒక పోస్టర్ ని ఉద్దేశించి, అది కించపరిచేలా ఉంది అని ట్వీట్ చేసారు. దాంతో అదే కామెంట్‌కి ఇప్పుడు రిప్లై ఇస్తూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. అందులో ఒకరు, “నేను ఇప్పుడే ఒక రాబోయే తెలుగు సినిమాలోని పాట చూసాను అది రిగ్రెసివ్ గా ఉంది” అని 1 నేనొక్కడినే సినిమా టైమ్‌లో సమంత చేసినట్టే ట్వీట్ చేసారు.

netizens recalling samantha tweet on 1 nenokkadine poster

ఇంకా చాలా మంది “అప్పుడు ఆ పోస్టర్ కించపరిచే విధంగా ఉంది అన్నప్పుడు, ఇప్పుడు ఈ పాట మగవాళ్లని తిట్టినట్లు ఉంది. అసలు మీకు ఈ హక్కు ఎవరిచ్చారు? దీనికి మీరు స్పందించరా?” అని సమంతపై కామెంట్స్ చేస్తున్నారు.

You may also like