“అసలు అలాంటి సీన్ ఎలా పెట్టారు..?” అంటూ… “ఆచార్య”ని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..! కారణమేంటంటే..?

“అసలు అలాంటి సీన్ ఎలా పెట్టారు..?” అంటూ… “ఆచార్య”ని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..! కారణమేంటంటే..?

by Mohana Priya

Ads

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు.

Video Advertisement

ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.

acharya

సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూశాం. సినిమా నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది అనే ఆసక్తి ఎవరిలో ఉండదు. ఎందుకంటే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చాలా చోట్ల సినిమా డల్ గా అనిపిస్తుంది. చిరంజీవి నటన బాగున్నా కూడా చాలా సీన్స్ లో చాలా డల్ గా ఎనర్జీ లేకుండా నటించారు అన్నట్టు అనిపిస్తుంది. రామ్ చరణ్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. సహాయ పాత్రల్లో చాలా మంది తెలిసిన నటులు ఉన్నాకూడా పెద్దగా హైలెట్ అయ్యే పాత్రలు ఎవరివి లేవు. సినిమాలో కొన్ని సీన్స్ పై నెటిజన్లు కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒక సీన్ మీద అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం గ్రాఫిక్స్. అందులో ఒక సీన్ లో చిరంజీవి మొహం గ్రాఫిక్స్ చేసినట్టు చూపిస్తారు.

అది గ్రాఫిక్స్ అని చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఆ సీన్ లో చిరంజీవి యంగ్ గా ఉన్నట్టు చూపిస్తారు. అందుకోసం గ్రాఫిక్స్ వాడారు. కానీ ఆ గ్రాఫిక్స్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అంతే కాకుండా “ఇంకా కొంచెం మంచి గ్రాఫిక్స్ వాడాలి కదా?” అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. కానీ సినిమా చూసిన తర్వాత కథలో కొత్తదనం లోపించడంతో ఆశించిన ఫలితం రావట్లేదు. అంతే కాకుండా కాజల్ పాత్ర కూడా పూర్తిగా కట్ చేయడంతో కారణం ఏంటో అలా ఎందుకు చేశారు అనే సందేహం నెలకొంది.


End of Article

You may also like