Ads
బిగ్ బాస్ షో ద్వారా ఒక సెలబ్రిటీ నిజ జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో బయటికి వచ్చాయి. వస్తాయి కూడా. అవన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడూ మనల్ని తెరపై ఎంటర్టైన్ చేసే సెలబ్రిటీల నిజ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా? వాళ్లు ఇన్ని సమస్యలను ఎదుర్కొని ఇంత స్టేజ్ కి వచ్చారా? అనిపిస్తుంది. కొంత మంది ఇవన్నీ సింపతి కోసం మాట్లాడిన మాటలు అని అంటారు.
Video Advertisement
కానీ కొంత మంది వాళ్లని ఇంకా గౌరవిస్తారు. ఇటీవల బిగ్ బాస్ లో జరిగిన ఒక సంఘటన మీద ఇలాగే తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు ప్రేక్షకులు. వివరాల్లోకి వెళితే. గత వారం జరిగిన ఒక టాస్క్ లో ఇతరుల జీవితాల్లో వెలుగు నింపిన సందర్భాలు చెప్పమని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఆదేశించారు. ఈ టాస్క్ లో భాగంగా లాస్య తన జీవితానికి సంబంధించిన ఒక సంఘటనను షేర్ చేసుకున్నారు.
లాస్య 2010 లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు విడిగా ఉండి 2012 నుండి భర్తతో కలిసి ఉన్నారు. మధ్యలో రెండు సంవత్సరాలలో తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పారు. 2014 లో తను ప్రెగ్నెంట్ అని తెలిసింది అని, కానీ ఇంట్లో గొడవలు అవుతాయి అని అబార్షన్ చేయించుకున్నారని, తర్వాత 2017 లో మళ్లీ తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారని,తర్వాత కొంత కాలానికి తను ప్రెగ్నెంట్ అని తెలిసింది అని, కానీ మిస్ క్యారేజ్ అయిందని, 2018 లో తను మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యారని, అప్పుడే అతనికి కొడుకు పుట్టాడని, తన కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని, ఇప్పటి వరకూ విషయాలను ఎక్కడా చెప్పలేదు అని, ఇప్పుడే ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు లాస్య.
ఈ టాస్క్ లో బిగ్ బాస్ లాస్యని విజేతగా ప్రకటించారు. కానీ కొంత మంది మాత్రం అసలు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కి, లాస్య చెప్పిన దానికి సంబంధం లేదు అని అంటున్నారు. ఇదే టాస్క్ లో సోహెల్ తన ఫ్రెండ్ భార్య డెలివరీకి డబ్బులు కావాలంటే ఎంతో మంది స్పందించి (క్రౌడ్ ఫండింగ్) డబ్బులు ఇచ్చినట్టు దాని ద్వారా కాంప్లికేషన్స్ తగ్గాయి అని, అలా మరొకరి జీవితంలో వెలుగులు నింపిన సందర్భం ఇది అని చెప్పారు.
కానీ బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన సోహెల్ ని విజేతగా ప్రకటించకుండా, లాస్య ని విజేతని చేయడం ఏంటి? లాస్య షేర్ చేసుకున్న స్టోరీ పెయిన్ ఫుల్ గా ఉన్నా కూడా ఇది సందర్భం కాదు కదా? అని అంటున్నారు నెటిజన్లు.
End of Article