Ads
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు పూజా హెగ్డే. ఇటీవల మోస్ట్ ఎలిజిలిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో హిట్ కొట్టిన పూజా హెగ్డే, ప్రస్తుతం రాధే శ్యామ్, అలాగే రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Video Advertisement
పూజా హెగ్డే ఇటీవల మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఇందుకు సంబంధంచిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా, అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే సౌత్ ఇండియన్స్ మీద కామెంట్ చేసి ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే. అయితే పూజా హెగ్డేని ప్రస్తుతం నెటిజన్లు అందరూ మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం పూజా హెగ్డే ఇటీవల చేసిన ప్రమోషన్. ఈ వీడియోలో పూజా హెగ్డే ఒక ఆల్కహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నట్లు చూపించారు.
దాంతో నెటిజన్లు అందరూ, “ఇలాంటివి ప్రమోట్ చేయడం తప్పు కదా?” అంటూ నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలా నెగటివ్ కామెంట్స్ అంతకుముందు రెజీనా కసాండ్రాపై కూడా ఇలాగే ఒక ఆల్కహాల్ ప్రమోట్ చేసినందుకు వచ్చాయి. ఇప్పుడు పూజా హెగ్డేపై కూడా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. కొంత మంది ఇలా కామెంట్ చేస్తూ ఉంటే, మరి కొంతమందేమో “ఇది కేవలం ప్రమోషన్ మాత్రమే దీనికి అంతాగా కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు” అని అంటున్నారు.
watch video :
https://www.instagram.com/p/CWsmT7Fgk5K/?utm_source=ig_web_copy_link
End of Article