Ads
ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూసిన మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ అయ్యింది. ఈ షోలో ఎన్టీఆర్ అడిగిన సమాధానాలు చెప్పడంతో పాటు, కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, అలాగే తన రాబోయే సినిమాలకి సంబంధించిన విషయాలని కూడా మహేష్ షేర్ చేసుకున్నారు.
Video Advertisement
సర్కారు వారి పాట సినిమాలో పోకిరి షేడ్స్ ఉంటాయి అని అన్నారు. అలాగే “కుటుంబంతో సమయం గడపడం చాలా ముఖ్యం అని, అందుకే సంవత్సరంలో చాలా సార్లు ఆలా ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్తాను” అని చెప్పారు. అంతే కాకుండా, రాజమౌళితో తన రాబోయే సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పారు.
ఇదిలా ఉండగా, షోలో ఎన్టీఆర్ మహేష్ ని ఒక పిక్చర్ చూపించి అందులో ఉన్న ప్రముఖ కట్టడం ఏంటో గుర్తించమని అడిగారు. అందులో ఉన్న కట్టడం పేరు మచ్చు పిచ్చు. ఇదే సమాధానం చెప్పిన మహేష్ బాబు, “ఈ లొకేషన్ రజినీకాంత్ గారి రోబోలో ఒక పాటలో ఉంటుంది కదా?” అని అన్నారు. అందుకు ఎన్టీఆర్, “అవును. కిలిమంజారో పాటలో ఉంటుంది” అని అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ, “అయితే, ఆప్షన్స్ లో కిలిమంజారో కూడా ఉంది కదా? ఆన్సర్ అది ఎందుకు కాకూడదు? పాట కూడా కిలిమంజారో అని ఉంటుంది కదా?” అని అన్నారు. అందుకు మహేష్, “అది శంకర్ గారిని అడగాలి” అని అన్నారు. అది కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. దాంతో, “ఇన్నాళ్లు మనం ఆ లొకేషన్ కిలిమంజారో అనుకున్నాం కదా? పాటలో కూడా కిలిమంజారో అని పెట్టి వేరే లొకేషన్ లో షూట్ చేసారా? శంకర్ గారు భలే మోసం చేసారు” అని సరదాగా అంటున్నారు నెటిజన్లు.
End of Article