“ఇండియన్ ఐడల్” లో తమన్ జడ్జిమెంట్ పై… నెటిజెన్స్ ఎలా కామెంట్స్ చేస్తున్నారో చూడండి..!

“ఇండియన్ ఐడల్” లో తమన్ జడ్జిమెంట్ పై… నెటిజెన్స్ ఎలా కామెంట్స్ చేస్తున్నారో చూడండి..!

by Mohana Priya

Ads

టీవీలో సింగింగ్ కాంపిటీషన్స్ కి కొదవ లేదు. ప్రతి ఛానల్ లో దాదాపు ఏదో ఒక సింగింగ్ కాంపిటీషన్ వస్తూనే ఉంటుంది. ఇందులో చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు జడ్జెస్ గా ఉంటారు. ఈ కాంపిటీషన్ ద్వారా ఎంతో మంది సింగర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు కూడా సరిగమప, పాడుతా తీయగాలాంటి సింగ్ కాంపిటీషన్స్ వస్తూనే ఉన్నాయి.

Video Advertisement

అయితే ఇవన్నీ మాత్రమే కాకుండా ఆహాలో ఇండియన్ ఐడల్ కూడా వస్తోంది. ఈ ప్రోగ్రాం ఇటీవల మొదలయ్యింది. దీనికి శ్రీ రామచంద్ర యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. తమన్, నిత్యా మీనన్, ప్రముఖ సింగర్ కార్తీక్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు.

netizens trolling thaman for indian idol telugu judgement

ఈ ప్రోగ్రాంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఎంతో మంది సింగర్స్ నుండి కొంత మందిని సెలెక్ట్ చేశారు.  వారందరికీ థియేటర్ రౌండ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఈ శుక్రవారం శనివారం టెలికాస్ట్ అవుతుంది. అయితే ఇందులో వైష్ణవి అనే ఒక అమ్మాయి పాట పాడుతోంది. సఖి సినిమాలోని స్నేహితుడా పాట ఈ అమ్మాయి పాడుతోంది. అంతకు ముందు వైష్ణవి పాడిన పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ పాటకి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

netizens trolling thaman for indian idol telugu judgement

తమన్, “లిరిక్స్ సరిగ్గా వినిపించడం లేదు” అని చెప్పారు. అయితే దీనికి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తమన్ సిద్ శ్రీరామ్ తో పాడించిన పాటల్లో ఉచ్చారణ పొరపాట్లు జరిగాయి. “అక్కడ కరెక్ట్ చేయలేదు కానీ, ఇక్కడ ఎలా చేస్తున్నారు?” అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సింగర్ కార్తీక్ కూడా వైష్ణవి పాడిన పాటలో కొన్ని పొరపాట్లు జరిగాయి అని చెప్తున్నారు. నిత్యా మీనన్ మాత్రం వైష్ణవి చాలా బాగా పాడారు అని అంటున్నారు.

watch video :


End of Article

You may also like