NBK Unstoppable : “అన్ స్టాపబుల్” ప్రోమోలో ఈ విషయాన్ని గమనించారా.?

NBK Unstoppable : “అన్ స్టాపబుల్” ప్రోమోలో ఈ విషయాన్ని గమనించారా.?

by Mohana Priya

Ads

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ఆహ తీసుకొస్తోంది. ఈ షోలో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు మాట్లాడించనున్నారు.

Video Advertisement

ustoppable with nbk promo

ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమోని ఇవాళ విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ ప్రోమో గమనిస్తే స్పాన్సర్స్ లో మాన్షన్ హౌస్ పేరు ఉంది. ఈ మాన్షన్ హౌస్ కి బాలయ్య బాబు కి ఉన్న సంబంధం ఏమిటో మనకి తెలుసు. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో ని ట్రోల్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ కి మంచు కుటుంబం వారు అతిథులుగా రాబోతున్నారు. మోహన్ బాబు గారు, మంచు విష్ణు, మంచు లక్ష్మి ఈ ప్రోగ్రాంకి అతిధులుగా రాబోతున్నారు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ప్రోగ్రాం నవంబర్ 4వ తేదీ నుండి మొదలవుతుంది.

watch video :


End of Article

You may also like