“బ్రహ్మానందం” ని విపరీతంగా ట్రోల్ చేస్తున్న తమిళ్ ఆడియన్స్..! కారణం ఏంటంటే..?

“బ్రహ్మానందం” ని విపరీతంగా ట్రోల్ చేస్తున్న తమిళ్ ఆడియన్స్..! కారణం ఏంటంటే..?

by kavitha

Ads

బ్ర‌హ్మానందం పేరు వింటేనే పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. వెయ్యికి పైగా సినిమాలలో నటించి, 1987 నుండి ఇప్పటివరకు తన హాస్యంతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన సినిమాలు తగ్గించినా, సోషల్ మీడియాలో బ్ర‌హ్మానందం నటించిన సినిమాలలోని ఫోటోలతో డైలాగ్ లతో మీమ్స్ ట్రెండింగ్ లో ఉంటాయి.

Video Advertisement

వందలాది పాత్రలలో నటించి, టాలీవుడ్ లో చెరగని ముద్ర వేశారు. ఆయన కామెడీ వల్లే హిట్ అయిన చిత్రాలు ఎన్నో. పలు తమిళ సినిమాలలో నటించిన బ్ర‌హ్మానందం చాలా గ్యాప్ తరువాత కిక్ మూవీతో కోలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీని నెటిజ‌న్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కోలీవుడ్ టాప్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన మూవీ ‘కిక్’. ఈ చిత్రంలో తాన్య హోప్ మరియు రాగిణి ద్వివేది హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. సుమారు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత బ్ర‌హ్మానందం తమిళ సినిమాలో నటించాడు. ఈ మూవీ లో సైంటిస్ట్ వాలి అనే క్యారెక్టర్ నటించాడు. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
2016లో సూపర్ హిట్ అయిన కన్నడ సినిమా జూమ్ కి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. డీడీ రిటర్న్స్‌తో విజయాన్ని సాధించిన సంతానం ఈ మూవీతో మరో విజయాన్ని అందుకోవాలనుకున్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరించింది. రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని నెటిజ‌న్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
వ‌ర‌స్ట్ సినిమా అని కొందరు నెటిజ‌న్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా, “అసలు ఇలాంటి సినిమాలో బ్రహ్మానందం ఎలా నటించారు?” “ఏం చూసి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు?” అంటూ బ్రహ్మానందంని కూడా కామెంట్ చేస్తున్నారు. తమిళ్ వాళ్ళు అయితే మన స్టార్ కమెడియన్ ని అలాంటి సినిమాలో చూసి ఏకంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా రెండున్న‌ర గంట‌ల పాటు సమయాన్ని వృథా చేసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి అని కామెంట్ చేస్తున్నారు. సినిమా అంతా డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఉందని దారుణంగా నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.


End of Article

You may also like