Ads
కుక్కలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ అందరూ వాటిని పెంచలేరు. అలాంటి వాళ్ల కోసం ఈ అమ్మాయి ఒక ఆవిష్కరణ చేసింది. దాంతో ఇప్పుడు ఈ అమ్మాయి చర్చల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని నేత్ర సింగ్ అనే ఒక అమ్మాయి ఒక రోబోటిక్ పెట్ ని ఆవిష్కరించింది. నేత్ర ఆరవ తరగతి చదువుతోంది.
Video Advertisement
ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఇది ఒక ఆవిష్కరణ అని 12 సంవత్సరాల నేత్ర సింగ్ తెలిపింది. బోయిన్ పల్లి లోని సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో నేత్ర చదువుకుంటోంది. 1000 మందితో కూడిన ఒక మీటింగ్ లో నేత్ర తన ఆవిష్కరణ ప్రదర్శించి దాని గురించి మాట్లాడింది.
ఈ మీటింగ్ లో నేత్ర తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, కొంత మంది అతిథులు, సహచరులు కూడా పాల్గొన్నారు. ఇలాంటి రోబోటిక్ పెంపుడు జంతువులు ఒంటరితనాన్ని న్యాయం చేస్తాయి అని, మానసికంగా దృఢం అవ్వడానికి మద్దతు ఇస్తాయి అని నేత్ర చెప్పింది. కోవిడ్ తర్వాత పెంపుడు కుక్కల దత్తత పెరగడంతో పాటు, నిర్వహణ ఖర్చు కూడా పెరిగింది. అంతే కాకుండా కుక్కలు చాలామందిని భయపెట్టడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి.
ఇలాంటి ఎన్నో సంఘటనల మధ్యలో నుండి నేత్రకి రోబోటిక్ పెంపుడు జంతువుని తయారు చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. నేత్ర పాఠశాల నిర్వహించిన స్టార్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ యాన్ ఈవినింగ్ అండర్ ది ఓపెన్ స్కై అనే ప్రోగ్రాంలో నేత్ర మాట్లాడి, తన ఆలోచనని అందరితో పంచుకుంది. నేత్ర ఆవిష్కరణని చూసిన వాళ్లు అందరూ కూడా నేత్రని మెచ్చుకుంటున్నారు. “ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం” అని అంటున్నారు. ప్రస్తుతం ఇది డెవలప్మెంట్ దశలో ఉంది.
దీనిని వాణిజ్య ఉత్పత్తిగా మార్చడానికి తనకి ప్రొఫెషనల్ సహాయం కావాలి అని నేత్ర తెలిపింది. నేత్ర పాఠశాల ప్రిన్సిపల్ కే సువర్ణ గారు ఈ విషయం మీద మాట్లాడుతూ, నేత్రతో పాటు ఇలాంటి ఆలోచనలు ఆవిష్కరించిన మరొక 50 మంది విద్యార్థులని అభినందించారు. “ఈ ప్రోడక్ట్ ఇంకా డెవలప్మెంట్ ఇంకా మొదటి దశలోనే ఉన్నప్పటికీ, కూడా ఇలాంటి ఆలోచన రావడం అనేది చాలా వినూత్నమైన అంశం” అని సువర్ణ గారు అన్నారు. నేత్ర ఆత్మస్థైర్యాన్ని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.
ALSO READ : SAI PALLAVI: న్యూ ఇయర్ కి “సాయి పల్లవి” ఏం చేసారో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!
End of Article