Ads
విజృంభిస్తున్న కరొనతో ఇప్పటికే చాల దేశాలలో పరిస్థితులు చేజారిపోయాయి . అగ్రరాజ్యం అమెరికా ,ఇటలీ లో ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు ,లక్షల సంఖ్యలో వ్యాధి బారిన పడ్డవారు నమోదు అయ్యారు ..చైనా వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ అన్ని దేశాలకు విస్తరించింది ..కాగా చైనా సాధారణ పరిస్థితికి చేరి అక్కడ పరిశ్రమలలో ఉత్త్పత్తులు కూడా తిరిగి ప్రారంభించింది ..ఇది చైనా కు కట్టుదిట్టంగా విధించిన పూర్తి లాక్ డౌన్ వలన సాధ్యమైంది …మిగిలిన దేశాలు కూడా ఇప్పుడు ఇదే పద్దతిలో లాక్ డౌన్ అమలు చేస్తూ కరోనా ను అదుపు చేసే పనిలో ఉన్నారు. కాగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అంత తీవ్రంగా దెబ్బ తిన్నది.
Video Advertisement
భారత దేశంలో కూడా ఇప్పటికే లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు ..బడా వ్యాపారవేత్తల నుండి సెలెబ్రెటీల దాక అందరూ పెద్ద మొత్తం లో సీఎం కేర్ ఫండ్ కు విరాళాలు ఇచ్చారు ..ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునే వారే మన దేశంలో ఎక్కువగా ఉండగా లాక్ డౌన్ వలన ఆదాయం లేక తినడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో చాల మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు..ఇప్పటికే చాలామంది సెలెబ్రెటీ లా దగ్గర నుండి సాధారణ ప్రజల వరుకు తమ పాటలతో మాటలతో క్రియేటివ్ గా కరోనా పై అవగాహనా కల్పించే ప్రయత్నం చేసారు ..కాగా ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక క్రియేటివ్ క్రియేషన్ అందరిని ఆకర్షిస్తుంద…వివరాలలోకి వెళ్తే
మనం చాలా రకాల వింత బైక్ లను కార్ లను ఇప్పటికే చాలానే చూసాం ..చాల మంది వాటర్ తోను తర్వాత బ్యాటరీతోను నడిచే కార్ లను తయారు చేసారని మనం చాలానే విన్నాం ..హైదరాబాద్ బహదూర్ కి చెందిన సుధాకర్స్ మ్యూజియం ఓనర్ సుధాకర కు ఈ కరోనా సమయంలో ఒక వినూత్న ఆలోచన వచ్చింది ..కరోనా వైరస్ కలకలం రేపుతున్న ఈ సమయంలో కరోనా వైరస్ షేప్ లో ఉండే కార్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ..ఆయన ఆలోచనను నిజం చేసుకున్నారు కూడా .
ఇప్పటికే సుధాకర్ చాలా విభిన్న కార్స్ ని తయారు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ..అసలు కరోనా వైరస్ షేప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే తయారు చేసి అందరికి కరోనా వైరస్ తెలిసేలాగా ప్రజలలో అవగాహనా పెరిగే ఉద్దేశంతోనే దీనిని తయారు చేసారని సుధాకర్ చెప్తున్నారు …ఈ కార్ ట్రయిల్ వీడియో ను సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యగా ఇప్పటికే ఈ వీడియో వైరల్ అయ్యి ప్రజల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది .
End of Article