సినిమా అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. థియేటర్ వరకు వెళ్లలేకపోయినా ఖాళీ సమయంలో ఇంట్లో అయినా సినిమా చూడాలి అని అనుకునే వారు చాలా మందే ఉంటారు. వారికి ఓటిటి ఓ వరం లాంటిది. కొత్త సినిమాలను కొద్దీ రోజులు పోయాక హాపీ గా ఇంట్లోనే చూసేయచ్చు. ఇక కొంతమంది కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూసినా.. చిన్న సినిమాలను ఓటిటిలో చూసేయచ్చులే అని అనుకుంటూ ఉంటారు.

Video Advertisement

ఓటిటి లో ప్రతి వారం ఏవో ఒక సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. ఈ వారంలో ఇప్పటి దాకా ఓ డబ్బింగ్ సినిమా, ఓ వెబ్ సిరీస్ తప్ప ఏమీ విడుదల అవ్వలేదు. అయితే నిరాశ అవసరం లేదు. ఓ రెండు తెలుగు సినిమాలు ఎలాంటి అనౌన్సమెంట్ లేకుండా ఓటిటి లోకి విడుదల అయిపోయాయి. ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “ఉస్తాద్”. ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ కామన్ మాన్ పైలట్ ఎలా అయ్యాడు? అందుకు ఎదురైనా అడ్డంకుల్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్న కథనం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

స్టోరీ చాలా బాగున్నా, కథనంలో ల్యాగ్ ఉండడం వలన థియేటర్ లో ఆడలేదు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు సుధాకర్ కోమకుల. ఈయన హీరో గా నటించిన సినిమా ‘నారాయణ & కో’. ఈ సినిమాను ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించారు. అనుకోకుండా వచ్చిన ఫైనాన్సియల్ సమస్యలను ఓ కుటుంబం ఎలా ఎదుర్కొంది అన్న కథనం ఆధారంగా రూపొందిన కామెడీ సినిమా ‘నారాయణ & కో’. ఇది కూడా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఈ రెండు తెలుగు సినిమాలే కాకుండా, ‘డీడీ రిటర్న్స్’ అనే ఓ డబ్బింగ్ మూవీ, ‘స్కామ్ 2003: ఏ తెల్గీ స్టోరీ’ అనే డబ్బింగ్ వెబ్ సిరీస్ కూడా విడుదల అయ్యాయి. వీటిని కూడా ఓ లుక్ వేసేయండి.