జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ కొత్త రూల్…ఇకపై గొడుగు ఉంటేనే దర్శనం.!

జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ కొత్త రూల్…ఇకపై గొడుగు ఉంటేనే దర్శనం.!

by Megha Varna

Ads

కరోనా ఉద్ధృతి రోజురోజుకి పెరిగిపోతుంది. దీనితో కరోనా వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచడానికి ప్రభుత్వాల జేబులు ఖాళీ అయిపోతున్నాయి.దీనివల్ల ప్రభుత్వాల పై ఆర్థిక భారం భారీగా పడుతుంది.ఇలాంటి టైంలో ప్రజలలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రభుత్వాలు ఆధ్యాత్మిక క్షేత్రాలను తెరపించాయి.

Video Advertisement

ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు వచ్చే భక్తులు సామాజిక దూరాన్ని పాటించటం లేదు. అలాగే మాస్క్ లు కూడా ధరించడం లేదు.దీనితో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్వహించేవారు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి టైంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని పెద్దమ్మ తల్లి గుడి నిర్వహకులు సరికొత్త ప్రయోగం చేశారు.ఆ ప్రయోగం చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

ఇంతకీ ఆ గుడి నిర్వహకులు ఏం చేశారంటే. గుడికి వచ్చే భక్తులు తప్పనిసరిగా తమ వెంట గొడుగు తెచ్చుకోవాలని గుడి లోపలికి వచ్చే ముందు వారు తెచ్చుకున్న గొడుగును తెరిచి పెట్టుకోవాలని దర్శనం పూర్తయ్యి బయటకెళ్ళే అంతవరకు ఆ గొడుగును మూయకూడదని ఓ నిబంధన పెట్టారు.దీనివల్ల ప్రజల మధ్య సామాజిక దూరం నిలుస్తుందని వారు భావిస్తున్నట్టు పేర్కొన్నారు.


End of Article

You may also like