మోటార్ వెహికిల్ చట్టానికి సవరణలు…మారబోతున్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ రూల్స్.!

మోటార్ వెహికిల్ చట్టానికి సవరణలు…మారబోతున్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ రూల్స్.!

by Megha Varna

Ads

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అన్ని దేశాలు లాక్ డౌన్ ని పాటించాయి.. సామాన్యుల నుండి విఐపిల వరకు అందరూ ఈ లాక్ డౌన్ రూల్స్ ని పాటించాల్సిన పరిస్థితి..ప్రస్తుతం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చారు..దాంతో జనం తమ రోజువారి జీవన విదానాన్ని ప్రారంభించారు..మొన్నీమధ్యే తెలంగాణా ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ కొన్ని కఠినతరం చేసిన సంగతి తెలిసిందే..తాజాగా కేంద్ర ప్రభుత్వం లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించిన  రూల్స్ మార్చనున్నట్లు సమాచారం.

Video Advertisement

కేంద్రం మోటార్ వెహికిల్ చట్టానికి సవరణలు చేసే యోచనలో ఉన్నట్లు , కేంద్రం ఇప్పటికే ఈ  అంశంపై కసరత్తు చేపటిన్నట్టు సమాచారం. ఈ మేరకు పరిశ్రామిక వర్గాలు, ఇతరుల నుంచి సలహాలు, సూచనలు సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ మేరకు.. ఒక వాహనంలో లోపాలు ఉంటే.. అప్పుడు దాన్ని తయారు చేసిన కంపెనీపై జరిమానా మరింత పెరుగుతుంది. ఈ పెనాల్టీ రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండొచ్చునని, జరిమానా మొత్తం వెహికల్ రకం, లోపాల ప్రాతిపదికన మారుతుందని సమాచారం.

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఓల్డ్ వెహికల్స్ వంటి వాటికి సంబంధించిన రూల్స్ మార్పునకు మార్చి నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసి, దానిపై పరిశ్రమ వర్గాల నుంచి అభిప్రాయాలు కోరింది. అయితే ఇంతలో కరోనా ముప్పు రావడంతో అదిపక్కకు పోయింది.తాజాగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత తిరిగి మరో నోటిఫికేషన్ ని జారీ చేసింది. మళ్లీ సలహాలు, సూచనలు కోరింది.

మోదీ సర్కార్ త్వరలో  “మోటార్ క్యాబ్ రెంట్ స్కీమ్” అనే కొత్త పథకాన్ని లాంచ్ చేయనుంది. ఇందులో భాగంగా కారు, టూవీరల్, సైకిల్ వంటి వాటిని అద్దెకు తీసుకునే అవకాశం కల్పించనుంది. ఇప్పటికే వోగ్, జూమ్, బైక్ రెంటల్ పేరిట ప్రైవేట్ సంస్థలు ఎన్నో ఉన్నాయి..ప్రభుత్వ ఆద్వర్యంలో ఇలాంటి స్కీమ్ వస్తే సొంతంగా వాహనాలు కొనుగోలు చేయలేని వారికి ఎక్కువ మేలు జరుగుతుందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.


End of Article

You may also like