ఇకపై స్కూల్ రూల్స్ లో వచ్చే మార్పు ఇదేనా? సామాజిక దూరం పాటించడం కోసం ఏం చేస్తారంటే?

ఇకపై స్కూల్ రూల్స్ లో వచ్చే మార్పు ఇదేనా? సామాజిక దూరం పాటించడం కోసం ఏం చేస్తారంటే?

by Megha Varna

కరోనా వైరస్ కారణంగా విధించిన పూర్తి లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు ,వ్యాపారస్తులు ,సెలెబ్రెటీలు మరియు సామాన్య ప్రజలు అంతా ఇంటికే పరిమితం అయ్యారు.ఈ లాక్ డౌన్ ఏంటో ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అర్ధం కావట్లేదు ..లాక్ డౌన్ గడువు పూర్తి అవుతుంది అనేలోపు మళ్ళీ కేంద్రం ఆ గడువును పొడిగిస్తూ వస్తుంది.దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం దీనికి ప్రధాన కారణమనే చెప్పాలి.ఈ నేపథ్యంలో విద్యార్థులకు స్కూల్లు,కాలేజీలు సెలవలు కావడంతో పరీక్షలు మధ్యలోనే ఆగిపోవడంతో తరువాత చేరుకోవాల్సిన తరగతిపై పలు అభిప్రాయాలూ వినపడుతున్నాయి.ఈ అంశం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అయితే ఒకటి నుండి తొమ్మిదవ తరగతి వరుకు ఉన్న విద్యార్థులు తరువాత తరగతికి ప్రమోట్ చేయబడతారు అని క్లారిటీ ఇచ్చారు..

Video Advertisement

ఇలా లాక్ డౌన్ అవ్వడంతో ఇప్పటికే చాలా ప్రైవేట్ విద్య సంస్థలు ఆన్లైన్ లో టీచింగ్ క్లాస్ లు చెప్పడం ప్రారంభించారు.ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో క్లాస్ లు వింటున్న పిల్లవాడికి వాళ్ళ అమ్మ యూనిఫామ్ వేసి కూర్చుపెట్టడంతో ఈ విషయంపై పలు ట్రోల్ల్స్ వచ్చి విపరీతంగా నవ్వించిన విషయం తెలిసిందే.ఇకపై స్కూల్ విదార్థులు ఒక రోజు స్కూల్ లో ప్రత్యేక్షంగా తరగతి గదిలో బోధనలు విని రెండొవ రోజు మాత్రం ఆన్లైన్ లో క్లాస్ లు వినేవిధంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రణాలికను రూపొందిస్తుంది..

కరోనా వైరస్ కారణంగా ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించాలని కేంద్రం ముందు నుండి చెప్తూ వస్తుంది.దీనిపై సెలబ్రెటీలు సైతం సామాన్య ప్రజలకు అహగాహన కలిపించేలా పలు ప్రచారాలు కూడా చేసారు.ఇలా స్కూల్ వాతావరణంలో ఎక్కువ మంది విదార్థులు ఒకేసారి ఉంటె సామాజిక దూరం పాటించే అవకాశం ఉండదు కాబట్టి సగం మంది విద్యార్థులను తరగతి గదిలో ఉంచి మిగతా సగం మంది ఆన్లైన్ లో పాఠాలు వినడం వలన సామాజిక దూరం పాటించే అవకాశం ఉంటుంది తద్వారా కరోనా వైరస్ ను అదుపు చేసే భౌతిక దూరం పాటించేలా ఉంటుంది అని కేంద్ర ఈ దిశగా అడుగులు వేస్తుంది.

ఈ మేరకు గవర్నమెంట్ స్కూల్స్ లో డిజిటల్ బోధనా కొంచెం కష్టతరంగా కనిపిస్తుంది.ప్రస్తుతానికి రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉంటె 1 .5 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.కాగా వీరికి ఆన్లైన్ తరగతిలో విద్య బోధనా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.ఇంకా ఎలాంటి ఆంక్షలను పాటించాలనే విషయంపై పూర్తి క్లారిటీ విద్య శాఖ త్వరలో చెప్పనుంది.


You may also like

Leave a Comment