Ads
కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన పదో తరగతి పరీక్షలను లాక్ డౌన్ ఎత్తేసిన రెండు వారాలకు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ దిశగా షెడ్యూల్ సిద్దం చేస్తున్నారంట విద్యాశాఖ అధికారులు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధిని వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో మాదిరిగా కాకుండా ఒక పరీక్ష హాలులో కేవలం 12 మంది విద్యార్ధులు మాత్రమే పరీక్ష రాసేలా చర్యలు తీసుకోబోతున్నారు. విద్యార్థులకు మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. విద్యార్ధులకు మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండటంతో పాటుగా ప్రతీ బెంచ్‌కు ఒక విద్యార్ధి మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Video Advertisement
అదే విధంగా తెలంగాణాలో కూడా… సీఎం కేసీఆర్ హైకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం మిగతా 8 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. 2500 పరీక్షా కేంద్రాలను అవసరమైతే 5000కు పెంచుతాం అని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెలలోనే టెన్త్ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు.ఎందుకంటే ఎస్‌ఎస్‌సీ ఆధారంగానే ఇతర అడ్మిషన్స్, ఇంటర్మీడియట్ చదువు ఆధారపడి ఉంటుంది అని సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
End of Article