Ads
తెలంగాణావ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ అప్సర హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకి వస్తుండం అందరిని షాక్ కి గురిచేస్తోంది. నిందితుడు సాయికృష్ణ పరిచయం కాకముందే అప్సరకు వివాహం అయిన విషయం బయటకు వచ్చింది.
Video Advertisement
తాజాగా అప్సర, కార్తీక్ రాజాలపెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై హత్యకు గురైన అప్సర తల్లి మాట్లాడుతూ నిందితుడు సాయికృష్ణను కాపాడడం కోసమే తమ కూతురు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ రాజా తల్లి ఆడియోను రిలీజ్ చేసింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాజాగా అప్సర భర్త కార్తీక్ తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల చేసింది. ఆ ఆడియో ధనలక్ష్మి పెళ్లి ఫోటోలు నిజమే అని వెల్లడించింది. అప్సర తమకు కొంచెం కూడా ఇష్టం లేదని, తన కుమారుడు కార్తీక్‌కి నచ్చడం వల్లనే ఇద్దరికీ వివాహం చేశాసామని ధనలక్ష్మి అన్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే అప్సర వేరుగా కాపురం పెట్టించిందని అన్నారు. అప్సర టూర్లు, లగ్జరీ జీవితాన్ని ఇష్టపడేదని, వాటి కోసం తన కుమారున్నీ టార్చర్ పెట్టేదని చెప్పారు.
అప్సర వేధింపులు తట్టుకోలేక తన కొడుకు కార్తీక్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ధనలక్ష్మి వెల్లడించారు. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్ లో ఉన్నారనే విషయం తమకు తెలియదని అన్నారు. ఇక అప్సరకు తన కొడుకు కార్తీక్ రాజాతో వివాహం అయ్యిందని ధనలక్ష్మి కన్‌ఫామ్ చేయగా, అప్సర తల్లి పెళ్లి విషయం గురించి ఇప్పుడు అప్రస్తుతం, పోలీసులే తమ కూతురు అప్సర హత్య విషయంలో న్యాయం చేయాలని అడుగుతోంది.
మరోవైపు నిందితుడు సాయికృష్ణ తండ్రి పోలీసుల దర్యాప్తులో వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడు సాయికృష్ణకు 14 రోజులు రిమాండ్ ను కోర్టు విధించింది. మొత్తానికి అప్సర హత్య కేసు డైలీ సీరియల్ లా కంటిన్యూ అవుతోంది.
watch video :
Also Read: జస్ట్ మిస్… చివరి నిమిషంలో ప్రమాదం నుండి తప్పించుకుంది..! ఈ మహిళ కథ ఏంటో తెలుసా..?
End of Article