పెళ్లికి గిఫ్ట్ గా వచ్చిన హోం థియేటర్ పేలడంతో నవ వరుడు మరణించిన ఘటనలో సంచలన విషయం బయట కొచ్చింది. కొత్తగా పెళ్లి అయిన జంట ప్రాణాలు తీయడం కోసమే హోం థియేటర్‌లో బాంబును అమర్చి బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు చేసిన దర్యాప్తులో బయటపడింది.
Video Advertisement
ప్రేమించిన తనను పెళ్లి చేసుకోకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంతో పెళ్ళికూతురి మాజీ లవర్ ఈ ఇలా చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడిని జైలుకు పంపించారు. అసలు ఏం జరిగిందంటే.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కబీర్‌ధామ్ జిల్లాలోని చమరి అనే గ్రామస్థుడు హేమేంద్రకి తమ పొరుగూరి అమ్మాయితో మార్చి 31న పెళ్లి జరిగింది. వారి పెళ్లికి వచ్చిన గిఫ్ట్స్ లో హోం థియేటర్ కూడా ఉంది. హేమేంద్ర ఏప్రిల్ 2న హోం థియేటర్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన వెంటనే పేలిపోయింది. హేమేంద్ర అక్కడికక్కడే కన్నుమూశాడు.
అతని అన్న రాజ్‌కుమార్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గరలోని హాస్పటల్ కి తరలించారు. అయితే వైద్యం చేస్తుండగానే రాజ్‌కుమార్ మరణించాడు. ఈ ఘటన పై సమాచారం అందగానే పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన స్థలంలో పోలీసులు గన్‌పౌడర్‌ను గుర్తించారు. అప్పుడు ఆ బహుమతి ఎవరు ఇచ్చారని ఆరా తీయడంతో అసలు నిజం బయటపడింది. పెళ్లికూతురు మాజీ లవరే నిందితుడు సర్జు అని పోలీసుల దర్యాప్తులో బయట కొచ్చింది.
అంతకుముందే వివాహం సర్జు అనే వ్యక్తి తనకు పెళ్లి అయిన విషయాన్నిదాచిపెట్టి ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఆ యువతికి హేమేంద్రతో వివాహం నిశ్చయం అవగానే సర్జుకు దూరంగా ఉంది. దాంతో ఆమెపై పగ పెంచుకున్న అతను నవ దంపతుల ప్రాణాలు తీయడానికి ప్లాన్ వేశాడు. దానిలో భాగంగానే హోం థియేటర్‌లో బాంబును అమర్చి వారికి బహుమతిగా ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. సర్జుని అరెస్టు చేసి, విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసధికారి మీడియాతో చెప్పారు.
Also Read: ఈ అబ్బాయి చేసిన పని తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..! తండ్రి చనిపోయిన తర్వాత కూడా..?