Ads
ఇటీవల లక్నో లో ఒక యువతి ఒక క్యాబ్ డ్రైవర్ ని కొట్టిన సంఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి పేరు ప్రియదర్శిని. ప్రియదర్శిని రోడ్ దాటుతున్న సమయంలో సాదత్ అలీ సిద్ధిఖీ అనే ఒక క్యాబ్ డ్రైవర్ కార్ నడుపుకుంటూ ప్రియదర్శిని దగ్గరికి తీసుకువెళ్లారు. దాంతో కార్ తనని ఢీ కొట్టబోయింది అని ప్రియదర్శిని కార్లో ఉన్న సాదత్ ని కిందకి దింపి కొట్టారు. అంతే కాకుండా ఈ ఘర్షణ అడ్డుకోవడానికి వచ్చిన ఇంకొక వ్యక్తి మీద కూడా చేయి చేసుకున్నారు.
Video Advertisement
దాంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని అంటూ సాదత్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ప్రియదర్శని మాట్లాడుతూ, “క్యాబ్ డ్రైవర్ కారు ని జీబ్రా క్రాసింగ్ మీదకి పోనిచ్చాడు. ఇందులో తప్పు ఎవరిది? ఒకవేళ మీకు అంత అనుమానం ఉంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. ఒకవేళ నాకు ఏమైనా అని ఉంటే నా డెడ్ బాడీని పంపించేవారా?”అని అన్నారు.
ఈ విషయంపై సాదత్ మాట్లాడుతూ, “ఆ అమ్మాయి నా ఫోన్ తీసుకొని ముక్కలు ముక్కలుగా పగలగొట్టింది. నా కార్ సైడ్ అద్దాలని పగలగొట్టింది. నా జేబులో నుండి 600 రూపాయలు తీసుకుంది. నేను ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించలేదు. అయినా సరే పోలీసులు నా మాట పట్టించుకోకుండా జైల్లో పెట్టారు. నాకు 24 గంటల వరకు ఆహారం కూడా ఇవ్వలేదు. నేను ఒక పేద కుటుంబానికి చెందిన వాడిని. నాకు న్యాయం కావాలి”అని అన్నారు.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా తప్పు ప్రియదర్శినిది అని తేలింది. ప్రియదర్శిని నిర్లక్ష్యంగా రోడ్డు దాటుతున్న దృశ్యం వీడియోలో రికార్డయింది. దాంతో సోషల్ మీడియా అంతట ఆ అమ్మాయిని అరెస్ట్ చేయమని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రియదర్శిని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అప్పుడు ప్రియదర్శిని మాట్లాడుతూ, “పోలీసులు నా ఇంటికి వచ్చి నా కుటుంబ సభ్యులను వేధించారు. వారి దగ్గర నా ఫోన్ నంబర్, నా కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. నాపై మోపిన ఈ ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవు. నేను అతనిని ఊరికే కొట్టలేదు. నా ఆత్మ రక్షణ కోసం అతని మీద చేయి చేసుకున్నాను”అని చెప్పారు.
watch video :
End of Article