PUB-G ప్రేమ కథలో కొత్త ట్విస్ట్..! ఏం జరిగిందంటే..?

PUB-G ప్రేమ కథలో కొత్త ట్విస్ట్..! ఏం జరిగిందంటే..?

by Mohana Priya

Ads

.గత కొద్ది రోజులుగా అనేక ట్విస్టులు తీసుకుంటున్న పబ్జీ ప్రేమ కథ మరొకసారి వార్తల్లో నిలిచింది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మొదలైన ఈ పబ్జీ ప్రేమాయణం కారణంగా సీమా హైదర్‌ అనే పాకిస్తానీ మహిళ పాకిస్తాన్ విడిచిపెట్టి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించడం జరిగింది.

Video Advertisement

సచిన్ మీనా అనే వ్యక్తితో పబ్జీ గేమ్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఈ నలుగురు పిల్లల తల్లి అతని కోసం పిల్లలతో సహా భారత్‌కు చేరుకుంది. ఇప్పుడు ఇద్దరూ పెళ్ళి చేసుకుని పిల్లలతో కలిసి హాయిగా సెటిల్ అయిపోయారు కూడా.

గ్రేటర్ నోయిడాలో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్న సీమా హైదర్‌ పై అక్రమ చొరబాటు కేసు నమోదు కావడం ఆ తర్వాత హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడం అందరికీ తెలిసిందే. ఇక తర్వాత తిరిగి పాకిస్తాన్ కి వెళ్ళేది లేదని తను హిందువుగా ఉండడానికే ఇష్టపడుతున్నానని ఆమె తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఇందుకోసం అధికారులను కూడా సంప్రదిస్తానని సీమా తెలిపారు. పాకిస్తాన్ కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని ఒకవేళ వెళ్ళినా అక్కడ తన ప్రాణాలకు ముక్కు ఉందని ఆమె పేర్కొన్నారు.

సీమా మొదటి భర్త హైదర్ అలీ సౌదీలో లో పని చేస్తూ ఉండగా గత మూడేళ్లుగా సీమా తన పిల్లలతో పాకిస్థాన్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు ఒక భారతీయుడు కోసం వెళ్ళిపోయిన ఆమెతో తమకు ఎటువంటి సంబంధం లేదని .ఇక ఆమె పాకిస్తాన్ కు తిరిగి రావాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. కానీ నలుగురు పిల్లల్ని మాత్రం పాకిస్తాన్ కి పంపవలసిందిగా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సీమా ఈ విషయంపై ఎలా స్పందిస్తారో తెలియదు. .


End of Article

You may also like