భార్యా బాధితుడి కేసులో బయటికి వచ్చిన కొత్త ట్విస్ట్..! లక్ష్మీ గౌతమి ఏం అన్నారంటే..?

భార్యా బాధితుడి కేసులో బయటికి వచ్చిన కొత్త ట్విస్ట్..! లక్ష్మీ గౌతమి ఏం అన్నారంటే..?

by Harika

Ads

ఇటీవల ఒక వ్యక్తి తన భార్య తనని ఇబ్బంది పెడుతోంది అంటూ ఫిర్యాదు చేశారు. ఆయన పేరు టెమూజియన్. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజోలు జిల్లాకు చెందిన టెమూజియన్ కి 7 సంవత్సరాల క్రితం లక్ష్మీ గౌతమితో పెళ్లి జరిగింది. వాళ్లకి 5 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. మల్లారెడ్డి కాలేజీలో టెమూజియన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. కుటుంబంతో కలిసి అల్వాల్ లో ఉంటున్నారు. రెండు రోజుల నుండి టెమూజియన్ మీడియా ముందుకు వచ్చి తన భార్య తనని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. ఇదే విషయం మీద అల్వాల్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు.

Video Advertisement

new twist in temujiyan lakshmi gouthami incident

కానీ లక్ష్మీ గౌతమి మాత్రం ఈ విషయం మీద మరొక రకంగా చెప్తున్నారు. లక్ష్మీ గౌతమి మీడియాతో మాట్లాడుతూ, స్టార్ మేకర్ అనే యాప్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యారు అని, ఆ అమ్మాయితో టెమూజియన్ ప్రేమలో ఉన్నారు అని చెప్పారు. అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అని చెప్పారు. ఆ అమ్మాయి కోసం తనని కూడా వదిలేయాలి అని అనుకున్నారు అని అన్నారు. ఒక సమయంలో ఆ అమ్మాయి కూడా టెమూజియన్ మీద తనని ఇబ్బంది పెడుతున్నారు అని రామగుండం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది అని లక్ష్మీ గౌతమి చెప్పారు.

లక్ష్మీ గౌతమి ఈ విషయం మీద మాట్లాడుతూ తన భర్తకి తన నుండి డైవర్స్ కావాలి అని అందుకే ఇలాంటి లేనిపోని విషయాలు అన్నీ తన మీద చెప్తున్నారు అని అన్నారు ఆస్తి కోసం టెమూజియన్ ని ఇబ్బంది పెడుతున్నాను అనే మాటల్లో అసలు నిజం లేదు అని అన్నారు. ఎందుకంటే తన కుటుంబానికే ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి అని చెప్పారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం తిరగబడటంతో దెబ్బలు తగిలాయని, లేకపోతే తను తన భర్తని అసలు ఇబ్బంది పెట్టలేదు అని లక్ష్మీ గౌతమి చెప్పారు.


End of Article

You may also like