ఆర్ఆర్ఆర్ సినిమా బృందం ఇవాళ మరొక అప్డేట్ విడుదల చేసింది. అదేంటంటే ఈ సినిమా ఆడియోకి సంబంధించిన హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ చేసుకుంది. హిందీ ఆడియోకి సంబంధించిన హక్కులను టీ సిరీస్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే సంగీత దర్శకులు కీరవాణి గారు ఈ సినిమా పాటలు రికార్డ్ చేసే పనిలో ఉన్నారు.

rrr update

ఇటీవల బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అమిత్ త్రివేది తో ఒక పాటని రికార్డ్ చేశారు కీరవాణి గారు. ఆ పాటని అమిత్ త్రివేది తో కలిసి రియా ముఖర్జీ పాడారు. నిన్న తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కలిసి ఈ సినిమాకి సంబంధించిన ఒక మ్యూజిక్ సెషన్ చేశారు కీరవాణి గారు. దీనికి సంబంధించి “అనిరుధ్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు కీరవాణి గారు.

 

ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే ఇటీవల హీరోయిన్ అలియా భట్ షూటింగ్ లో పాల్గొన్నారు. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, ప్రభాస్ మీద ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంది అనే వార్త వినిపిస్తోంది. ఇది ఆగస్ట్ లో విడుదల అవుతుంది అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా బృందం అధికారికంగా ప్రకటించేంత వరకు ఆగాల్సిందే. ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలో విడుదల అవ్వబోతోంది.