కరోనా వైరస్ చాలదన్నట్లు చైనాలో మరో కొత్త వైరస్ ఇపుడు అందరిని బయపెడుతుంది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. వారి కధనం ప్రకారం ఆ కొత్త వైరస్ పేరు హంట వైరస్. చైనాలోని షాంగ్దండ్ ప్రొవియన్సులో 39 ఏళ్ళ వయసున్న ఓ వ్యక్తికి హంట అనే వైరస్ సోకింది. దీంతో అతను మృతి చెందాడు అని ఆంగ్ల వెబ్సైట్లలో పబ్లిష్ అయ్యింది. అతను మరణించిన తరువాత 32 మందిని పరీక్షించామని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని నివేదిక పేర్కొంది.

Video Advertisement

కాగా ఈ వైరస్ వ్యాప్తికి ఎలుకలే ప్రధాన కారణమని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇంటిలో చుట్టుపక్కల పరిసరాల్లో ఎలుకల వలన హంటావైరస్ వ్యాప్తించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఎలుకల లాలజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకితే అది సంక్రమిస్తుందని తెలిపింది.

1959 లో ఈ వైరస్ ను మొదటిసారిగా గుర్తించారు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ 2016 నుంచి అందుబాటులోకి వచ్చింది. అప్పుడెప్పుడో ప్రభావం చూపిన హంట వైరస్ ఇపుడు మళ్లీ రావడంతో అందరు బయపడి పోతున్నారు. ఈ వైరస్ భారిన పడితే శ్వాసకోశ వ్యాధికి గురవుతారని పేర్కొంది.