Home Filmy Adda Brahmanandam : నితిన్-బ్రహ్మానందం మధ్య గొడవలు..? కారణం అదేనా..?

Brahmanandam : నితిన్-బ్రహ్మానందం మధ్య గొడవలు..? కారణం అదేనా..?

by Mohana Priya

సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు గత కొద్ది సంవత్సరాల నుండి సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదు. ఒకవేళ నటించినా కూడా అతిధి పాత్రల్లో మాత్రమే కనిపిస్తున్నారు.

ఇదేవిధంగా గత సంవత్సరంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో ఒక చోట, అలాగే ఈ సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాలో ఒక రెండు మూడు సినిమాల్లో నటించారు. అయితే ప్రస్తుతం బ్రహ్మానందం గారికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమయం కథనం ప్రకారం, అదేంటంటే, నితిన్ హీరోగా నటిస్తున్న రాబోయే సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం బ్రహ్మానందం గారిని సంప్రదించారట.

News about issue between Nithiin and Brahmanandam

బ్రహ్మానందం గారు కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా నుంచి బ్రహ్మానందం గారు తప్పుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం బ్రహ్మానందం గారు షూటింగ్ సెట్ కి సమయానికి చేసుకోకపోవడం, అలాగే డైరెక్టర్ చెప్పినట్టు  వినకపోవడం అని అంటున్నారు. ఈ విషయాల వల్ల ఇబ్బంది పడిన నితిన్. బ్రహ్మానందం గారిని పక్కకు పెట్టారు అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు.

You may also like