Ads
సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబుతో పాటు, హీరోయిన్ అయిన కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, అలాగే సముద్రఖనితో పాటు ముఖ్య పాత్రల్లో నటించిన సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి కనిపిస్తున్నారు.
Video Advertisement
ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అని తెలుస్తోంది.
గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ ఈ సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
image source : Instagram (sowmyamenon_)
అయితే ట్రైలర్ లో వీరందరితో పాటు మరొక నటి కూడా కనిపించారు. చాలా మంది నెటిజన్లు ఆమె ఎవరు అని అనుకుంటే, చాలా మంది ఆ నటి చూడడానికి నిధి అగర్వాల్ లాగా ఉన్నారు అని అన్నారు. సర్కారు వారి పాట ట్రైలర్ లో హీరోయిన్ తో పాటు కనిపించిన ఈ నటి పేరు సౌమ్య మీనన్. సౌమ్య యాక్టర్ తో పాటు డాన్సర్ కూడా. సౌమ్య హంటర్ అనే ఒక కన్నడ సినిమాలో నటించారు. అలాగే ఒక మలయాళం సినిమాలో కూడా నటించారు. ఇవి మాత్రమే కాకుండా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో ఒక పాత్రలో నటించారు.
End of Article