ఏప్రిల్ 30 వరకు తెలంగాణ లో “నైట్ కర్ఫ్యూ”…కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఎవరికి ఉన్నాయి.?

ఏప్రిల్ 30 వరకు తెలంగాణ లో “నైట్ కర్ఫ్యూ”…కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఎవరికి ఉన్నాయి.?

by Mohana Priya

Ads

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ మళ్ళీ మొదలైంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల లాక్ డౌన్ విధించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తి ఎక్కువైన నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్యల్లో భాగంగానే రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇవాల్టి నుంచి అంటే ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉన్నట్లు తెలిపింది. బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది.

Video Advertisement

కర్ఫ్యూ నుండి మినహాయింపులు

# ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మసీలు

# ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా

# టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సర్వీసెస్, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు

# ఈ కామర్స్ వస్తువుల డెలివరీ

# పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, సీఎన్‌జీ పెట్రోలియం, గ్యాస్ ఔట్ లెట్స్

# శక్తి ఉత్పాదన, పంపిణీ

# కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్

# నీటి సరఫరా, పారిశుధ్యం

# ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్

# ప్రొడక్షన్ యూనిట్స్

కర్ఫ్యూ సమయంలో వీరు తప్ప మిగతా పౌరులు బయట తిరగడం నిషేధం.

# పైన పేర్కొన్న సంస్థల్లో పనిచేసేవారికి కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంటుంది. వారు ఐడెంటి కార్డు తప్పకుండా చూపించాలి.

# కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ అధికారులు ఐడి కార్డ్ చూపించి ప్రయాణం చేయవచ్చు.

# డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ ఇతర ఆసుపత్రి సిబ్బందికి కూడా అనుమతి ఉంది.

# గర్భిణీలు, వైద్య సహాయం తప్పనిసరిగా అవసరమైన వారు.

# ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ నుండి రాకపోకలు సాగించే వాళ్ళు. కానీ వారు టికెట్ ఖచ్చితంగా చూపించాలి.

ఈ నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 51-60, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటారు.


End of Article

You may also like