లైవ్ లో ప్రభాస్ తో పెళ్లి గురించి ఓ నెటిజెన్ అడిగితే…నిహారిక రియాక్షన్ ఇదే..!

లైవ్ లో ప్రభాస్ తో పెళ్లి గురించి ఓ నెటిజెన్ అడిగితే…నిహారిక రియాక్షన్ ఇదే..!

by Sainath Gopi

Ads

మెగా కుటుంబం నుంచి హీరోలే కాదు, హీరోయిన్ కూడా వ‌చ్చింది. మెగా ప్రిన్సెస్ గా తెరంగేట్రం చేసింది నిహారిక. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక‌. ఎంట్రీ గ్రాండ్ గా ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. హిట్ అందుకోలేకపోయింది. తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అవకాశాలు అందుకుంది. అక్కడ సక్సెస్ అవ్వలేకపోయింది. ఇన్ని రోజులు తెలుగింటి పిల్ల లాగా అందంగా పద్దతిగా కనిపించే నిహారిక ఇప్పుడు గేర్ మార్చి అందాలు ఆరబోస్తుంది.

Video Advertisement

‘ఒక మ‌న‌సు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ లాంటి సినిమాలు చేసినప్పటికీ నో రిజల్ట్. ఇక ఇటీవలే ‘సైరా నరసింహా రెడ్డి’లో కూడా చిన్న పాత్ర పోషించింది. మొన్నామధ్య బీచ్‌లో రెచ్చిపోయిన నిహారిక. ఇప్పుడు మరోసారి ఇదే చేసింది. మోడ్రన్ డ్రస్‌లో అందాలు ఆరబోసింది మెగా ప్రిన్సెస్. ఆమె పెట్టిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉండగా..తాజాగా ఆన్‌లైన్ ద్వారా అభిమానులతో మాట్లాడిన నిహారిక వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల కింద ప్రభాస్‌తో నిహారిక పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. ఇదే ప్రశ్నను ఇప్పుడు సోషల్ మీడియాలో నిహారికను ఓ అభిమాని అడిగాడు. దీనికి స్పందించిన నిహారిక.. “మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. ఆ వార్తలన్నీ అవాస్తవాలు. నేను ప్రభాస్‌ను లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం నిజం కాదని” చెప్పింది. అలాగే తమ ఫ్యామిలీలో తనకు వైష్ణవ్ తేజ్ బాగా క్లోజ్ అని చెప్పింది. ఇక, సాయిధరమ్ తేజ్ తనకు వరసకు బావ అయినా అన్నయ్యతో సమానమని చెప్పింది.

పెళ్లి పుకార్లు ఒక ప్రభాస్ విషయంలోనే కాదని సాయి తేజ్ ని కూడా గతంలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పుకార్లు” సృష్టించారని చెప్పుకొచ్చింది.అంతేగాక నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి పుకార్లను పుట్టించడం సరికాదని తెలిపింది. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నిహారిక.. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఆశించినంత విజయాన్ని అందించలేదు. 2019లో వచ్చిన సైరా నరసింహా రెడ్డిలో చిన్న పాత్రలో త‌ళుక్కుమ‌న్నారు.


End of Article

You may also like