Ads
నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య కి అపార్ట్‌మెంట్ సభ్యుల మధ్య తీవ్రంగా గొడవ జరిగి కంప్లైంట్ ఇచ్చే వరకు వెళ్లిందని తెలిసింది. నిహారిక భర్త రచ్చ చేస్తున్నారని.. వారు ఫిర్యాదు చేయగా చైతన్య కూడా తిరిగి అపార్ట్ మెంట్ సభ్యుల పై ఫిర్యాదు చేసారు. ఈ విషయంపై చైతన్య తన స్టేట్మెంట్ వీడియో విడుదల చేశారు.
Video Advertisement
ఇందులో చైతన్య మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు, “ప్రొడక్షన్ ఆఫీస్ కోసం అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నాం. అది ఓనర్ గారికి చెప్పి తీసుకున్నాము. ఓనర్ కి, టెనెంట్ కి, అసోసియేషన్ కి మధ్య మిస్ కమ్యూనికేషన్ అయ్యింది. ఇదంతా అవుతుండగా గత నెల మేము ఇక్కడ ఉండకూడదు అని చెప్పారు. ఆగస్టు 10వ తేదీన వెళ్ళిపోతాము అని చెప్పాను.
అసోసియేషన్ వాళ్లు అపార్ట్మెంట్ కి వచ్చారు. ఆ టైమ్లో నేను లేను. కానీ మా టీం అంత ఉన్నారు. అక్కడ మీటింగ్ జరుగుతోంది. అయినా సరే వాళ్లు లోపలికి వచ్చారు. అప్పుడు చాలాసేపు చర్చ జరిగింది. మా స్టాఫ్ వీడియో రికార్డ్ చేశారు. దాన్ని నేను రుజువుగా పోలీసులకు ఇచ్చాను. కంప్లైంట్ ఫైల్ చేశాను. అలా కంప్లైంట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అలా అంత మంది వచ్చి మాట్లాడడమే.
అదే ఒక ఇద్దరు, ముగ్గురు చెప్పుంటే అంత గొడవ అయ్యేది కాదు. ఇది అయ్యాక మేము కంప్లైంట్ ఫైల్ చేసిన దానికి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేశారు. వాళ్లు అలా అంతమంది వచ్చి మాతో మాట్లాడడానికి వెనకాల కారణం ఏంటో, అలా చేయడానికి వాళ్ళని ప్రేరేపించిన సంఘటనలు ఏంటో వాళ్లు అందులో చెప్పారు.
ఇదే జరిగింది. కానీ మీడియాలో మాత్రం వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు. తర్వాత వాళ్ల మీద నేను కంప్లైంట్ ఫైల్ చేశాను అని అంటున్నారు. ఇదంతా తప్పు. మీరు వెళ్ళి పోలీసులతో మాట్లాడి నిజాలని వెరిఫై చేసుకోవచ్చు. ఇదంతా అయిన తర్వాత ఇన్స్పెక్టర్ మా ఇద్దరికీ కాల్ చేసి మాట్లాడారు. అసోసియేషన్ వాళ్లు కూడా అసలు ముందు చెప్పకుండా అంత మంది వచ్చి మాట్లాడడం అనేది తప్పు అని అంగీకరించారు.
అలాగే నాకు, నిహారిక కి సారీ చెప్పారు. దీని తర్వాత నేను కేసు విత్ డ్రా చేసుకున్నాను వాళ్లు కూడా కౌంటర్ విత్ డ్రా చేసుకున్నారు. మేము వెళ్లిపోతున్నాము, ఆఫీస్ కోసం వేరే ఇల్లు వెతుక్కుంటున్నాము అని చెప్పాము. అసలు జరిగిందేమిటో ఒకసారి కనుక్కొని అప్పుడు మాట్లాడండి అని నేను మీడియాని, మిత్రులని కోరుతున్నాను.” అని చెప్పారు.
Watch video:
End of Article