Ads
గత వారం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ లో నిహారిక కొణిదెల పెళ్లి ఒకటి. డిసెంబర్ 9వ తేదీన నిహారికకి, చైతన్యతో ఉదయ్ పూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. చైతన్య తండ్రి ప్రభాకర్ రావు గుంటూరు రేంజ్ ఐజీ. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన చైతన్య జూబ్లీహిల్స్ లో ఉన్న భారతీయ విద్యా భవన్ లో చదువు పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
Video Advertisement
హైదరాబాద్ కి చెందిన ఒక మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నారు చైతన్య. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ పెళ్లిలో సందడి చేశారు. పెళ్లి వేడుకలో నిహారిక వేసుకున్న దుస్తులు హైలైట్ గా నిలిచాయి. సంగీత్ కి శాంతను – నిఖిల్ డిజైన్ చేసిన డ్రెస్ ధరించారు. మెహందీ కి నిహారిక వేసుకున్న డ్రెస్ అయిషా రావు డిజైన్ చేశారు.
అలాగే పార్టీకి రియా పిళ్ళై రస్తోగి డిజైన్ చేసిన గౌన్ ధరించారు. నిహారిక లుక్స్ అన్నిటిని ప్రముఖ స్టైలిస్ట్ అశ్విన్ మావ్లే డిజైన్ చేశారు. హైదరాబాద్ లో రిసెప్షన్ కి నిహారిక వేసుకున్న గాగ్రా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ గాగ్రా ని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.
రుహానియత్ పేరుతో డిజైన్ చేసిన కలెక్షన్ లోని ఈ గాగ్రా ని లాక్ డౌన్ లో వర్చువల్ గా జరిగిన FDCI ఫ్యాషన్ వీక్ 2020 లో షో స్టాపర్ అయిన జాన్వీ కపూర్ ధరించారు. జాన్వీ కపూర్, నిహారిక వేసుకున్న అవుట్ ఫిట్ ఒకేలా ఉన్నా కూడా స్టైలింగ్ మాత్రం డిఫరెంట్ గా చేశారు. రిసెప్షన్ కి చైతన్య వేసుకున్న డ్రెస్ కూడా మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.
End of Article