Home Filmy Adda MEGA PRINCESS RE ENTRY: రీ ఎంట్రీ ఇస్తున్న మెగా హీరోయిన్ …. ఈసారైనా కలిసి వచ్చేనా.?

MEGA PRINCESS RE ENTRY: రీ ఎంట్రీ ఇస్తున్న మెగా హీరోయిన్ …. ఈసారైనా కలిసి వచ్చేనా.?

by Sainath Gopi

మెగా ఫ్యామిలీలో డజన్ మంది హీరోలు ఉన్నా కూడా… ఒకే ఒక్క హీరోయిన్ ఆ ఫ్యామిలీ నుండి వచ్చింది.ఆమె కొణిదల నీహారిక. నాగశౌర్య పక్కన ఒక మనసు సినిమా తోటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వకపోయినా కూడా నిహారికాకు మంచి పేరు తీసుకువచ్చింది. తర్వాత అడపా దడపా సినిమాలు చేసిన కూడా అవి ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

nagababu-niharika

తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు దూరమైంది. తన భర్తతో గొడవలు రావడంతో తాజాగా విడాకులు కూడా తీసుకుంది. తాను నటనకు దూరమైనా కూడా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ని స్థాపించి సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టింది. అయితే ఇప్పుడు నిహారిక మళ్లీ రీ ఎంట్రీ కి సిద్ధమైంది. వాట్ ద ఫిష్ అనే మూవీ లో నీహారిక నటిస్తుంది.నీహారిక పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాని కొత్త దర్శకుడు వరుణ్ కోరుకొండ తరికెక్కిస్తున్నారు. గతంలో ఈ మూవీని మంచు మనోజ్ హీరోగా తరికెక్కిస్తున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. అయితే ఈసారైనా నిహారికాకి అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి.

You may also like