సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక న్యూ లుక్ ఫొటోస్.. చిన్న జుట్టు తో ఎలా ఉందంటే..!!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక న్యూ లుక్ ఫొటోస్.. చిన్న జుట్టు తో ఎలా ఉందంటే..!!

by Sunku Sravan

Ads

మెగా ఫ్యామిలీ డాటర్ నిహారిక ఎప్పుడూ ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మొన్నటి వరకు పబ్ డ్రగ్స్ విషయంలో సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. ఈ విధంగా ఏదో రకంగా నాగబాబు గారాల కూతురు నిహారిక కనబడుతూనే ఉంటుంది. తన కెరీర్ ప్రారంభంలోనే బుల్లితెర మీద సందడి చేసిన ఈ బ్యూటీ చాలా వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

Video Advertisement

తర్వాత హీరోయిన్ గా ఒక మనసు అనే సినిమాలో మొదటిసారి కనిపించింది. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమాలో ఓ మాదిరి నటనతో అదరగొట్టింది. దీని తర్వాత సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి మూవీస్ లో కూడా కనిపించింది. కానీ ఈ సినిమాలు అపజయం పాలు కావడంతో వెబ్ సిరీస్ బెటర్ అనుకొని వెనక్కి తగ్గింది.

సైరా సినిమాలో చిన్న రోల్ చేసినా ఆమెకు కలిసి రాలేదు. ఇక కరోనా సమయంలో 2020 డిసెంబర్ 9వ తేదీన గుంటూరు ఐజి కొడుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి చైతన్య జొన్నలగడ్డ తో వివాహం జరిగింది. అప్పటివరకు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసిన నిహారిక.. ఇక సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. కానీ అకస్మాత్తుగా ఇన్స్టా అకౌంట్ కూడా డిలీట్ చేసింది.

ఈ మధ్యకాలంలో టాస్క్ఫోర్స్ పోలీసులు పబ్బు రైడ్ లో ఈమె పేరు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిపారు. నిహారిక అక్కడికి వెళ్ళింది నిజమే కానీ ఎలాంటి తప్పు చేయలేదు అంటూ తండ్రి నాగబాబు చిన్న వీడియో రిలీజ్ చేసి బయటకు వదిలారు. ఈ క్రమంలో నిహారిక ఒక కొత్త లుక్ లో దర్శనం ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచింది. చిన్న జుట్టు తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

 


End of Article

You may also like